Viral Video: శుఖీభవ.. అంటూ ఆశీర్వదించిన ఏనుగు.. కృతజ్ఞత చూపిండంలో దీనికి మించిన జంతువు లేదనుకుంటా..
ABN , First Publish Date - 2022-09-23T22:59:42+05:30 IST
కృతజ్ఞత చూపిండంలో కొన్నిసార్లు మనుషుల కంటే జంతువులే మేలని అనిపిస్తుంటుంది. చేసిన సాయాన్ని గుర్తుంచుకోకపోగా.. తిరిగి వారికే నమ్మక ద్రోహం చేసే రోజులివి. ఇలాంటి నేటి..
కృతజ్ఞత చూపిండంలో కొన్నిసార్లు మనుషుల కంటే జంతువులే మేలని అనిపిస్తుంటుంది. చేసిన సాయాన్ని గుర్తుంచుకోకపోగా.. తిరిగి వారికే నమ్మక ద్రోహం చేసే రోజులివి. ఇలాంటి నేటి పరిస్థితుల్లో తమని చూసి నేర్చుకోమంటూ.. చాలా జంతువులు అప్పుడప్పుడూ సందేశాన్ని ఇస్తుంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ (Social media viral videos) అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి.. నెటిజన్లను కట్టిపడేస్తోంది. ఓ ఏనుగు (elephant) అటవీ సిబ్బందిని శుఖీభవ అంటూ ఆశీర్వదించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. కృతజ్ఞత చూపించడంలో ఈ ఏనుగుకు మించిన జంతువు లేదంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో (Chhattisgarh forest area) ఈ ఘటన చోటు చేసుకుంది. వృక్ష, జంతు సంరక్షణ విషయంలో అటవీ సిబ్బందికి కొన్నిసార్లు అనుకోన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. అయినా, ప్రాణాలకు తెగించి మరీ.. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటుంటారు. ఛత్తీసగఢ్ అటవీ సిబ్బందికి కూడా ఇటీవల ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఏనుగుల మంద నుంచి ఓ పిల్ల ఏనుగు తప్పిపోయినట్లు తెలుసుకున్నారు. వెంటనే దాని కోసం వెతకడం ప్రారంభించారు. నిముషాల వ్యవధిలోనే పిల్ల ఏనుగును గుర్తించి.. తల్లి ఏనుగు వద్దకు తీసుకెళ్లారు. అయితే ఇక్కడే ఓ ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. పిల్లను చూడగానే తల్లి ఏనుగు.. సంతోషంతో ఉప్పొంగిపోయినట్లు ఉంది. తన పిల్లను తొండంతో ప్రేమగా తడిమిన తర్వాత.. అంతే ప్రేమతో అటవీ సిబ్బందిని కూడా, తొండం పైకి ఎత్తి శుఖీభవ.. అంటూ ఆశీర్వదించింది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి సుశాంత నందా.. తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.