Viral Video: ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు..? విమానాశ్రయంలో కనిపించగానే అమాంతం అతడి కాళ్లపై ఆమె ఎందుకు పడిందంటే..
ABN , First Publish Date - 2022-10-01T21:34:28+05:30 IST
1980, 90ల కాలంలో దూరదర్శన్ చూసిన వాళ్లకు రామాయణం సీరియల్ (Doordarshan Ramayanam serial) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో ఈ ధారావాహిక ఎంత...
1980, 90ల కాలంలో దూరదర్శన్ చూసిన వాళ్లకు రామాయణం సీరియల్ (Doordarshan Ramayanam serial) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో ఈ ధారావాహిక ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. రామానంద్ సాగర్ రచించి, నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సీరియల్.. దూరదర్శన్‌లో 1987లో ప్రసారం చేయబడి... సుమారు ఏడాదిన్నర పాటు ప్రేక్షకులను విశేషంగా అలరించింది. అందులో రాముడు, లక్ష్మణుడు, సీత పాత్రలను పోషించిన నటీనటులు.. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రసిద్ధి చెందారు. ప్రధానంగా ఇందులో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ (Arun Govil) .. ప్రజల హృదయాల్లో నిజమైన రాముడిగా నిలిచిపోయారు. రాముడు అంటే ఇలానే ఉంటాడేమో.. అన్నంతగా ఆయన ఆ పాత్రలో లీనమైపోయారు. ఇప్పటికీ అందులోని నటీనటులను ప్రజలు దేవుళ్లలా ఆరాధిస్తుంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు ఉదాహరణ..
1990లో బుల్లితెర చరిత్రలో సంచలనం సృష్టించిన రామాయణం ధారావాహికను (Ramayana serial) ఇష్టపడని వారుండరు. ఈ ధారావాహికలో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్.. తాజాగా ఓ ఎయిర్‌పోర్టులో తారసపడ్డారు. ఆయన్ని చూడగానే ఓ మహిళ.. ఒక్కసారిగా శ్రీరాముడిని చూసినంత ఆనందానికి లోనైంది. వెంటనే ఆయన పాదాలకు నమస్కారం చేసింది. ఆమెతో పాటూ మరో వ్యక్తి కూడా అరుణ్ గోవిల్‌కు నమస్కారం చేశాడు. ఆ సమయంలో ఆయన కొంత అసౌకర్యానికి గురైనా.. ఆమెతో ఓపికగా మాట్లాడాడు. ఎంత వద్దంటున్నా మహిళ మాత్రం ఆయన పాదాలు వదలకుండా పట్టుకుంది.
Viral Video: బలమైన గాలులు, వర్షంలో.. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పకుండా.. రోడ్డు ఎలా దాటాడో చూడండి..
తర్వాత అరుణ్ గోవిల్‌తో అంతా గ్రూప్ ఫొటో దిగారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ (Social media viral videos) అవుతోంది. కాగా, 2020 మొదటి లాక్డౌన్ సమయంలో ఈ రామాయణం ధారావాహికను దూరదర్శన్‌లో రీ టెలీకాస్ట్ చేశారు. దీంతో ఇప్పటి తరం వారు కూడా ఈ సీరియల్‌ను సూపర్ హిట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన వినోద కార్యక్రమంగా ఈ సీరియల్ రికార్డు సృష్టించింది. ఇందులో రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్‌తో పాటూ పలువురు ప్రముఖులు నటించారు. సీతగా దీపికా చిఖ్లియా, లక్ష్మణుడిగా సునీల్ లహ్రి, హనుమంతుడిగా దారా సింగ్, రావణునిగా అరవింద్ త్రివేది , మంథరగా లలితా పవార్, ఇంద్రజిత్‌గా విజయ్ అరోరా నటించారు.