Viral Video: చితక్కొట్టడం అంటే ఇదేనేమో.. రాత్రి పూట నడిరోడ్డుపై ఇద్దరు యువతులు ఎలా కొట్టుకున్నారో మీరే చూడండి..!
ABN , First Publish Date - 2022-10-01T23:12:23+05:30 IST
పురుషులు గొడవపడే ఘటనలు సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అయితే మహిళలు పోట్లాడుకునే ఘటనలు (Women fighting incident) అరుదుగా జరుగుతుంటాయి. అందులోనూ..
పురుషులు గొడవపడే ఘటనలు సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అయితే మహిళలు పోట్లాడుకునే ఘటనలు (Women fighting incident) అరుదుగా జరుగుతుంటాయి. అందులోనూ చిన్న చిన్న కారణాలకు కొందరు మహిళలు రచ్చరచ్చ చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు.. సోషల్ మీడియాలో ఇలా షేర్ చేయగానే, అలా వైరల్ (Social media viral videos) అవుతుంటాయి. కొందరి గొడవకు గల కారణాలు.. చాలా సిల్లీగా ఉంటాయి. ప్రేమికుడి కోసం ఇద్దరు యువతులు కొట్టుకోవడం, ఇళ్ల పక్కన చెత్తాచెదారం తదితర చిన్న చిన్న సమస్యలకు మహిళలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడాన్ని తరచూ చూస్తుంటాం. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఎక్కడ జరిగిందో, ఎందుకు జరిగిందో.. తెలీదు గానీ ఇద్దరు యువతులు పిచ్చిపిచ్చిగా కొట్టుకున్న వీడియో (young women Videos) వైరల్ అవుతోంది. రోడ్డుపై ఇద్దరు యువతులు ఆగ్రహంతో జుట్టు పట్టుకుని ఒకరినొకరు తోసుకుంటూ, కొట్టుకుంటూ ఉంటారు. పక్కన వాహనాలు వస్తున్నాయనే విషయం కూడా మర్చిపోయి.. పోటీపడి మరీ గొడవపడుతుంటారు. బాక్సింగ్ ఆటను తలపించేలా ఓ యువతి.. మరో యువతి మొఖంపై పిడి గుద్దులు కురిపిస్తుంది. ఆమె కూడా నేనేం తగ్గను అన్నట్లుగా వేగంగా పంచులు విసురుతుంది.
Viral Video: బలమైన గాలులు, వర్షంలో.. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పకుండా.. రోడ్డు ఎలా దాటాడో చూడండి..
ఒక చేత్తో జుట్టు పట్టుకుని, మరో చేత్తో ఒకరి ముఖంపై మరొకరు కొట్టుకుంటారు. వీరిని చూసిన వాహనదారులు అవాక్కై.. అక్కడే నిలుపుకొంటారు. రోడ్డున పక్కన ఉన్న నిలబడి ఉన్న కొందరు.. ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. కానీ వారిని విడిపించేందుకు మాత్రం ఎవరూ సాహసించరు. ఇక్కడ యువతులు మాత్రం ఎవరినీ పట్టించుకోకుండా ఒకరి జుట్టు మరొకరు లాక్కుంటూ కొట్టుకుంటూ ఉంటారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఇదిలావుండగా, ఢిల్లీ మెట్రో రైల్లో (Delhi Metro Rail) సీటు కోసం ఇద్దరి మహిళలు గొడవపడిన వీడియో కూడా ఇలాగే తెగ వైరల్ అయింది.