కుక్కను దూరంగా తీసుకెళ్లమన్న భార్య.. పట్టించుకోని భర్త, కుటుంబ సభ్యులు.. దీంతో చివరకు కూతురితో కలిసి..
ABN , First Publish Date - 2022-09-17T03:23:31+05:30 IST
భార్యను అర్థం చేసుకుని.. సంతోషంగా జీవనం సాగించాల్సిన కొందరు భర్తలు, అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. భార్య సమస్యను అర్థం చేసుకోకపోగా.. చివరికి వారిపైనే దాడికి...
భార్యను అర్థం చేసుకుని.. సంతోషంగా జీవనం సాగించాల్సిన కొందరు భర్తలు, అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. భార్య సమస్యను అర్థం చేసుకోకపోగా.. చివరికి వారిపైనే దాడికి పాల్పడుతుంటారు. కొందరైతే అనుమానం పెంచుకుని కావాలనే చిత్రహింసలు (Torture) పెడుతుంటారు. ఈ క్రమంలో చాలా మంది మహిళలు చివరకు అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుంటారు. బెంగళూరులో ఓ మహిళ విషయంలో ఇలాగే జరిగింది. కుక్కను దూరంగా తీసుకెళ్లమని భార్య చెప్పినా.. భర్త, అత్తమామలు పట్టించుకోలేదు. దీంతో చివరకు కూతురుతో కలిసి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళితే..
కర్నాటక బెంగళూరులోని (Bangalore) బనస్‌వాడి హెచ్‌బీఆర్ లేఅవుట్‌లో శ్రీనివాస్, దివ్య(36) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి హృదయ (13) అనే కుమార్తె ఉంది. దివ్య, శ్రీనివాస్‌లకు 2008లో వివాహమైంది. అప్పటి నుంచి వీరి కుటుంబంలో ఎలాంటి సమస్కలూ లేవు. అయితే ఇటీవల కొన్ని నెలలుగా దివ్య అలెర్జీతో బాధపడుతోంది. వైద్యులను సంప్రదించగా చికిత్స చేయడంతో పాటూ పలు సూచనలు ఇచ్చారు. ఇందులో భాగంగా పెంపుడు కుక్కలకు దూరంగా ఉండాలని సూచించారు. దీంతో వారి ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కను దూరంగా తీసుకెళ్లాలని భర్తను కోరింది. అయితే అతను పట్టించుకోలేదు. చివరకు అత్తమామలకు కూడా ఈ విషయాన్ని పలుమార్లు తెలియజేసింది. వారు కూడా ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
డెలివరీ బాయ్ అంకితభావానికి సెల్యూట్ చేయాల్సిందే.. పార్సిల్ అందించడం కోసం ప్రాణాలనే ఫణంగా పెట్టి మరీ..
ఈ విషయంలో ఇంట్లో రోజూ గొడవలు జరుగుతుండేవి. అయినా కుటుంబ సభ్యులు మాత్రం కుక్కను ఇంట్లోనే పెట్టుకున్నారు. సోమవారం కూడా ఈ విషయమై ఇంట్లో గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో కూతుర్ని తీసుకుని భార్య ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎంత సేపటికీ బయటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. పలుమార్లు పిలిచినా లోపలి నుంచి స్పందన రాలేదు. దీంతో కిటికీ నుంచి లోపలికి చూడగా.. తల్లీకూతుళ్లు ఉరికి వేలాడుతూ కనిపించారు. ఈ ఘటనపై పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు అందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు.. దివ్య భర్త శ్రీనివాస్, అత్తమామలు, బావ తదితరులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.