యాక్సిడెంట్ వల్ల రెండు కాళ్లు విరిగి మంచాన పడిన భర్త.. మూడేళ్ల తర్వాత మామను చంపించిన కోడలు.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2022-08-26T21:02:41+05:30 IST

కొందరు పదే పదే తప్పులు చేస్తూ.. వాటిని కప్పిపుచ్చేందుకు మళ్లీ తప్పు మీద తప్పులు చేస్తుంటారు. ఇంకొందరైతే తమకు అడ్డొచ్చిన వారిని చంపడానికి కూడా వెనుకాడరు. ఇటీవల..

యాక్సిడెంట్ వల్ల రెండు కాళ్లు విరిగి మంచాన పడిన భర్త.. మూడేళ్ల తర్వాత మామను చంపించిన కోడలు.. అసలు కథేంటంటే..

కొందరు పదే పదే తప్పులు చేస్తూ.. వాటిని కప్పిపుచ్చేందుకు మళ్లీ తప్పు మీద తప్పులు చేస్తుంటారు. ఇంకొందరైతే తమకు అడ్డొచ్చిన వారిని చంపడానికి కూడా వెనుకాడరు. ఇటీవల మగవారే కాకుండా మహిళలు (women) కూడా పలు నేరాలు చేసి.. చివరకు జైలు పాలవడం చూస్తూనే ఉన్నాం. వివాహేతర సంబంధాల విషయంలో ఇలాంటి నేరాలు ఇటీవల రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలో ఓ మహిళ దారుణానికి పాల్పడింది. యాక్సిడెంట్ కారణంగా భర్త రెండు కాళ్లు విరిగి మంచాన పడ్డాడు. ఈ క్రమంలో మూడేళ్ల తర్వాత కోడలు.. మామనే చంపేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రం నవోదా బేరా ప్రాంతంలో ధర్మారామ్, లచ్చా అలియాస్ భుర్కీ దేవి దంపతులు నివాసం ఉంటున్నారు. ఇదిలావుండగా, మూడేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో ధర్మారామ్‌.. రెండు కాళ్లు విరిగిపోయాయి. దీంతో అప్పటి నుంచి అతను మంచానికే పరిమితమయ్యాడు. అంతవరకు బాగున్న వీరి సంసారంలో అప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి. భుర్కీ దేవికి ఇటీవల రమేష్ బావ్రీ, ఓతారామ్ బావ్రీ అనే వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. భర్తకు తెలీకుండా వారితో మాట్లాడుతుంటూ ఉండేది. ఈ క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఒక్కోసారి ప్రేమికులు (Boy friends) ఒక్కొక్కరుగా నేరుగా ఇంటికే వస్తుండేవారు. ఈ విషయం ధర్మారామ్ తండ్రి చంపాలాల్ బావ్రీ(58)కి తెలిసి.. కోడలును నిలదీశాడు.

Crime News: ఆస్తి కోసం ఈ కూతురు వేసిన స్కెచ్ చూస్తే మతి పోతుంది.. చివరకు ఎంతకు తెగించావమ్మా...


ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే బాగుండదంటూ హెచ్చరించాడు. అయినా భుర్కీ దేవి ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. కొన్నాళ్లకు ఈ విషయంలో దంపతుల మధ్య కూడా గొడవలు జరిగేవి. అయితే ధర్మారామ్.. వికలాంగుడు కావడంతో సర్దుకుపోయేవాడు. మామ అడ్డు తొలగించుకుంటే తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భుర్కీ దేవి కుట్రపన్నింది. ఆగస్టు 23న రాత్రి ఇద్దరు ప్రేమికులకు ఫోన్ చేసి, ఇంటికి పిలిపించింది. అంతా కలిసి మామ చంపాలాల్ బావ్రీని హత్య చేశారు. ఈ సమయంలో మృతుడి కుమారుడు ధర్మారామ్ ఇంట్లోనే ఉన్నా.. ఏమీ చేయలేని పరిస్థితి. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని పరిశీలించారు. ధర్మారామ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేశారు.

తీర్థం తీసుకోగానే మూర్ఛపోతున్న యువతి.. ఐదేళ్ల అనంతరం పెళ్లి ప్రయత్నాలు చేస్తుండగా.. అసలు విషయం తెలిసి..



Updated Date - 2022-08-26T21:02:41+05:30 IST