నేను చనిపోయాకే నా విలువ మీకు తెలుస్తుందంటూ తల్లిదండ్రులకు మెసేజ్.. చనిపోయిన 21 ఏళ్ల యువకుడి మొబైల్‌లో..

ABN , First Publish Date - 2022-06-21T23:39:33+05:30 IST

ప్రస్తుత హైటెక్ యుగంలో మనిషి తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. ఇంట్లో తలెత్తే సమస్యలతో కొందరు, పని ఒత్తిడి కారణంగా మరికొందరు తీవ్ర ఆందోళనకు గురై.. చివరకు..

నేను చనిపోయాకే నా విలువ మీకు తెలుస్తుందంటూ తల్లిదండ్రులకు మెసేజ్.. చనిపోయిన 21 ఏళ్ల యువకుడి మొబైల్‌లో..

ప్రస్తుత హైటెక్ యుగంలో మనిషి తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. ఇంట్లో తలెత్తే సమస్యలతో కొందరు, పని ఒత్తిడి కారణంగా మరికొందరు తీవ్ర ఆందోళనకు గురై.. చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొందరైతే.. ఇంట్లో కుటుంబ సభ్యులు చిన్న మాట అన్నా కూడా.. దాన్ని సీరియస్‌గా తీసుకుని హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడడం చూస్తేనే ఉన్నాం. ఛత్తీస్‌గడ్‌లో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. నేను చనిపోయాక నా విలువ మీకు తెలుస్తుందంటూ ఓ యువకుడు తన తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టి, ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. 


ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రం జాంజ్‌గిర్-చంపా జిల్లాలోని పామ్‌ఘర్ ప్రాంతానికి చెందిన ఉమేంద్ రాయ్.. భార్యా, పిల్లలతో కలిసి బిలాస్‌పూర్‌లోని రాజీవ్ విహార్‌లో ఉన్న తన బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. ఉమేంద్ రాయ్‌ కుమారుడు అంకిత్ రాయ్ (21).. ఇంటర్ పూర్తి చేసి, ఐటీఐ శిక్షణ తీసుకున్నాడు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న తన మామ ఇంటి పనులను పర్యవేక్షిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం కుటుంబ సభ్యులంతా స్వగ్రామమైన పామ్‌ఘర్‌కు వెళ్లారు. ఆ సమయంలో అంకిత్ రాయ్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఏమైందో ఏమో తెలీదు గానీ.. మధ్యాహ్నం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అమ్మా.. నాన్నా.. నన్ను క్షమించండి.. నా చావుకు కారణమిదేనంటూ లేఖ రాసి మరీ 28 ఏళ్ల యువతి బలవన్మరణం


మృతుడి మామ సీతారం.. ఇంటికి రాగానే అంకిత్ రాయ్.. ఉరికి వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి జేబులో ఉన్న ఫోన్‌‌ స్క్రీన్ షాట్‌లో.. ‘‘అమ్మా నాన్నలు.. నా విలువ మీకు అర్థం కావడం లేదు.. నేను పోయిన తర్వాత నా విలువ మీకు అర్థమవుతుంది’’.. అని రాసి ఉంది. తల్లిదండ్రులు మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

కంగారుగా ఇంటికొచ్చిన కూతురు.. ఏడుస్తూ.. అమ్మా!.. ఊరి బయట పొలంలో... అంటూ ఆమె చెప్పింది విని..

Updated Date - 2022-06-21T23:39:33+05:30 IST