World Biggest Killer: షాకింగ్.. ప్రతీ యేటా 4 కోట్ల మందికి పైగా జనాల ప్రాణాలను తీస్తున్నది ఏంటో తెలుసా..?
ABN , First Publish Date - 2022-09-24T02:09:28+05:30 IST
కరోనా వచ్చినప్పటి నుంచి ప్రజలకు అంటు రోగాల భయం పట్టుకుంది. మొన్నటిదాకా బయటికి వెళ్లాలంటేనే ఎక్కడ ఏ రోగం అంటుకుంటుందో అని ఆలోచించేవారు. అయితే ప్రపంచ ఆరోగ్య..
కరోనా వచ్చినప్పటి నుంచి ప్రజలకు అంటు రోగాల భయం పట్టుకుంది. మొన్నటిదాకా బయటికి వెళ్లాలంటేనే ఎక్కడ ఏ రోగం అంటుకుంటుందో అని ఆలోచించేవారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) తాజా అధ్యయనంలో షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అంటు రోగాల కంటే.. ncd (Non Communicable Diseases) కారణంగానే ప్రపంచంలో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని తేలింది. గుండె జబ్బులు, క్యాన్సర్, షుగర్, శ్వాసకోశ వ్యాధుల కారణంగా ప్రతి ఏటా 4కోట్ల మంది మృత్యువాత పడుతున్నారట. సెప్టెంబర్ 21న WHO తాజా అధ్యయన వివరాలను వెల్లడించింది.
గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం వంటి నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులు (Non Communicable Diseases) ప్రపంచవ్యాప్తంగా 74 ఉన్నాయి. ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించే వ్యాధులు.. అంటు వ్యాధుల కంటే ప్రమాదకరమని WHO పేర్కొంది. NCDల కారణంగా ప్రతి ఏడాదీ 41 మిలియన్ల మంది చనిపోతున్నారు. వీరిలో 70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు 17 మిలియన్ల మంది ఉన్నారని తెలిసింది. గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం, శ్వాసకోశ వ్యాధులు.. అంటు వ్యాధులను అధిగమించాయని తేలింది. ఇలాంటి వ్యాధులను పర్యవేక్షిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ విభాగం అధిపతి బెంటె మిక్కెల్‌సెన్ జెనీవాలో మాట్లాడుతూ.. ఎన్‌సీడీల కారణంగా ప్రపంచంలో ప్రతి రెండు సెకన్లకు 70 ఏళ్లలోపు వారు ఒకరు మరణిస్తున్నారని తెలిపారు. ఊబకాయం, మధుమేహం వంటి ఎన్‌సీడీలతో బాధపడే వారు తీవ్రమైన అనారోగ్యానికి గురై.. వైరస్‌తో మరణించే ప్రమాదం ఎక్కువగా ఉందని WHO నివేదిక పేర్కొంది.
Amazon Great Indian Festival: అమెజాన్ సేల్‌లో అద్భుత అవకాశం.. ఈ 5 వస్తువులు సగం ధరకే..!
ప్రపంచ వ్యాప్తంగా 86 శాతం ఎన్‌సీడీ (Non Communicable Diseases) మరణాలు తక్కువ, తక్కువ మధ్య ఆదాయ దేశాలలో సంభవిస్తున్నాయని WHO అధ్యయనం పేర్కొంది. పేద దేశాలలో చాలా మందికి సరైన చికిత్స అందకపోవడంతో మరణాల శాతం పెరుగుతోంది. ఆఫ్ఘనిస్తాన్, మంగోలియా వంటి దేశాలలో హృదయ సంబంధ వ్యాధుల కారణంగా ఎక్కువ మంది చనిపోతున్నారని తెలిసింది. పొగాకు వాడకం, కల్తీ ఆహారం, హానికరమైన ఆల్కహాల్ వాడకం, శారీరక శ్రమ లేకపోవడంతో పాటూ వాయు కాలుష్యం కారణంగా ఎన్‌సీడీల సంఖ్య పెరుగుతోందని అధ్యయనం ద్వారా వెల్లడైంది. అలాగే పొగాకు వాడకం వల్ల ప్రతి ఏడాదీ.. 8 మిలియన్లకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ధూమపానం చేస్తున్న వారి కారణంగా 8 మిలియన్లలో లక్ష మంది అలవాటు లేని వారు చనిపోతున్నారట.
Viral Video: శుఖీభవ.. అంటూ ఆశీర్వదించిన ఏనుగు.. కృతజ్ఞత చూపిండంలో దీనికి మించిన జంతువు లేదనుకుంటా..
మరోవైపు కల్తీ ఆహారం కారణంగా మరో ఎనిమిది మిలియన్ల మంది చనిపోతున్నారు. హానికరమైన ఆల్కహాల్ వాడకం వల్ల ఇతర వ్యాధులతో పాటూ లివర్ సిర్రోసిస్, క్యాన్సర్ వ్యాధి సంభవిస్తోందని తెలిసింది. ఈ కారణంగా ప్రతి ఏడాదీ 1.7 మిలియన్ల మంది చనిపోతున్నారు. శారీరక శ్రమ లేని కారణంగా తలెత్తే వ్యాధులతో 830,000 మంది చనిపోతున్నారని WHO అధ్యయనం పేర్కొంది. ఇదిలావుండగా ఎన్‌సీడీల నివారణ విషయంలో అన్ని దేశాలూ తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మరణాల శాతాన్ని తగ్గించవచ్చని, 2030 నాటికి 39 మిలియన్ల మరణాలను నివారించగలిగేలా ముందుకు వెళ్లాలని అన్ని దేశాల ప్రభుత్వాలకు WHO సూచనలు చేసింది.