Viral Video: ఒడిలో చిన్న పిల్లాడిని పెట్టుకుని ఈ ఆర్మీ ఆఫీసర్ చెబుతున్నదేంటో వింటే సెల్యూట్ చేయకుండా ఉండలేరు..!

ABN , First Publish Date - 2022-10-31T18:41:33+05:30 IST

ఆ మహిళ పేరు రిగ్జిన్ చోరోల్. ఆమె భర్త రిగ్జిన్ కందప్ ఆర్మీ అధికారి కావాలని కలలు కన్నాడు. ఎంతో ప్రయత్నం తర్వాత లడఖ్ స్కౌట్స్‌లోని జెడాంగ్ సంపా బెటాలియన్‌లో రైఫిల్‌మెన్‌గా జాయిన్ అయ్యాడు. అయితే విధుల్లో ఉండగా ప్రమాదంలో మృతి చెందాడు.

Viral Video: ఒడిలో చిన్న పిల్లాడిని పెట్టుకుని ఈ ఆర్మీ ఆఫీసర్ చెబుతున్నదేంటో వింటే సెల్యూట్ చేయకుండా ఉండలేరు..!

ఆ మహిళ పేరు రిగ్జిన్ చోరోల్. ఆమె భర్త రిగ్జిన్ కందప్ ఆర్మీ అధికారి కావాలని కలలు కన్నాడు. ఎంతో ప్రయత్నం తర్వాత లడఖ్ స్కౌట్స్‌లోని జెడాంగ్ సంపా బెటాలియన్‌లో రైఫిల్‌మెన్‌గా జాయిన్ అయ్యాడు. అయితే విధుల్లో ఉండగా ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో తన భర్త కలలు నెరవేర్చాలని చోరోల్ భావించింది. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ తీసుకుని ఆర్మీ అధికారి కావాలనే కలను నెరవేర్చుకుంది. అంతే కాదు.. లద్దాఖ్ ప్రాంతం నుంచి భారత సైన్యంలో అడుగు పెడుతున్న మొదటి మహిళా అధికారిగా కూడా చోరోల్ నిలిచింది. నేను నా భర్త కలను నెరవేర్చాను. నేను ఆర్మీలోకి వెళ్లాలని నా భర్త కోరుకున్నారు. 2021 డిసెంబర్‌లో ట్రైనింగ్ అకాడమీలో నా ప్రయాణం మొదలైంది. ఒక్కగానొక్క బిడ్డకు 11 నెలలు దూరంగా ఉండి కఠినతరమైన శిక్షణను పూర్తి చేసుకున్నా. నా భర్త ఎక్కడున్నా నన్ను చూసి గర్వపడతారని చోరోల్ పేర్కొన్నారు.


ఇక, చోరోల్ లాగానే మరో మహిళ హర్వీన్ కౌర్ కహ్లోన్‌ది కూడా స్ఫూర్తివంతమైన కథే. ఆమె ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. జలంధర్‌కు చెందిన హార్వీన్ భర్త కెప్టెన్ కన్వల్ పాల్ సింగ్ విధి నిర్వహణలో మరణించారు. దీంతో హర్వీన్ ఆర్మీలోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఆర్మీలో చేరాలనే నా ఉత్సాహాన్ని చూసి నా భర్త నన్ను ప్రోత్సహించారు. భర్త కలను నిజం చేయాలనుకున్నానని హర్వీన్ పేర్కొన్నారు. తాజాగా చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA) నుంచి శనివారం 151 మంది జెంటిల్‌మెన్ క్యాడెట్లు, 35 మంది మహిళా క్యాడెట్లు శిక్షణలో ఉత్తీర్ణులయ్యారు. వీరందరూ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.

Updated Date - 2022-10-31T18:41:34+05:30 IST