ఒకప్పుడు పొలాల్లో పశువుల కాపరి.. ప్రస్తుతం ఈ మహిళ ఏ రేంజ్లో ఉందో అస్సలు ఊహించలేరు.. ఒక్కో ఏడాదికి..
ABN , First Publish Date - 2022-07-15T00:31:34+05:30 IST
ఒకప్పుడు ఆమె అందరిలాగే ఓ సామాన్య గృహిణి. పెద్దగా చదువు లేని కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. పశువులు కాపరిగా జీవనం మొదలుపెట్టిన ఆమె.. ప్రస్తుతం ఎవరూ ఊహించని స్థాయికి..
ఒకప్పుడు ఆమె అందరిలాగే ఓ సామాన్య గృహిణి. పెద్దగా చదువు లేని కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. పశువులు కాపరిగా జీవనం మొదలుపెట్టిన ఆమె.. ప్రస్తుతం ఎవరూ ఊహించని స్థాయికి చేరుకుంది. అప్పట్లో చదువురాని మహిళగా ఉన్న ఆమె.. ప్రస్తుతం ఓ కంపెనీకి డైరెక్టర్‌గా ఉండడంతో పాటూ విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతలు సాధించింది. ఒక్కో ఏడాదికి లక్షల్లో ఆదాయం గడిస్తోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌కు చెందిన నందా చౌహాన్ అనే మహిళ.. విజయగాధకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ ఇండోర్‌లో 'డే స్టార్ సోలార్ కుక్కర్ సొల్యూషన్' అనే కంపెనీ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ కంపెనీ డైరెక్టర్ అయిన నందా చౌహాన్ అనే మహిళ ఒకప్పుడు సాధారణ మహిళ. ఇండోర్ పరిధిలోని మారుమూల గ్రామంలో జన్మించిన ఈమె.. ఇండోర్ రావడానికి ముందు గ్రామంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. వంట చేసుకునేందుకు కలప అందుబాటులో లేని సమయంలో పొలాలు, తోటల్లో పొడి కలపను దొంగతనంగా తెచ్చుకునేవారు. ఈ క్రమంలో మహిళలు చాలా అవమానాలను ఎదుర్కొనేవారు. అప్పట్లో గ్యాస్ సిలిండర్ ఖరీదైనది కావడంతో చాలా మంది కలపతోనే వంట చేసుకునేవారని నందా చౌహాన్ తెలిపింది. ఆ సమయంలోనే తనకు సోలార్ ప్రొడక్ట్‌ను తయారు చేయాలనే ఆలోచన వచ్చినట్లు చెప్పింది. ఈ ఆలోచనతో తన కొడుక్కు మొదటి నుంచీ ఈ రంగంపై అవగాహన కల్పించినట్లు పేర్కొంది.
రూ.80 లక్షల జీతాన్నిచ్చే జాబ్‌కు గుడ్‌బై.. సొంతూరికి తిరిగొస్తే.. ఇదేం పిచ్చి పని అన్నవాళ్లే ఇప్పుడు అతడి సంపాదన చూసి..
నందా చౌహాన్ తన కుటుంబంతో సహా 24ఏళ్ల క్రితం ఇండోర్‌కు వచ్చింది. మధ్యప్రదేశ్‌లో దీదీగా ప్రసిద్ధి చెందిన సామాజిక కార్యకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత జనక్ పాల్టా అనే మహిళను కలిసింది. అప్పటి నుంచి కొన్నేళ్ల పాటు జనక్ పాల్టాకు చెందిన బార్లీ విలేజ్ ఇన్స్టిట్యూట్లో నందా చౌహాన్ తన భర్త రాజేంద్ర చౌహాన్‌తో కలిసి పని చేసేవారు. గోశాలకు సంబంధించిన బాధ్యతలన్నీ నందా చౌహానే చూసుకునేది. ఆ సమయంలో నందా చౌహాన్ సోలార్ ఉత్పత్తులపై మరింత అవగాహన పెంచుకుంది. ప్రస్తుతం 47 ఏళ్ల నందా చౌహాన్.. తన కొడుకు సునీల్‌ను బాగా చదివించడంతో పాటూ 'డే స్టార్ సోలార్ కుక్కర్ సొల్యూషన్' అనే పోర్టబుల్, మొబైల్ సోలార్ కుకింగ్ సెటప్ కంపెనీని ప్రారంభించారు. సోలార్ కుక్కర్, సోలార్ ప్యానెల్, సోలార్ లాంతర్ వంటి వాటిని తయారు చేయడం మొదలెట్టారు. గత మూడు నెలల్లోనే వీరి సోలార్ ఉత్పత్తులకు లండన్‌తో పాటు ఇతర దేశాల్లో డిమాండ్ మొదలైంది.
రూ.93 కోట్ల ఆస్తికి వారసురాలు.. అయినా రూపాయి కూడా వాడుకోలేని స్థితి.. మరణించేముందు తండ్రి పెట్టిన ఆ ఒక్క కండీషన్‌తో..!
అమర్నాథ్ యాత్రికులకు ప్రస్తుతం ఈ సోలార్ ఉత్పత్తులు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అన్ని యాత్రా స్థలాల్లో ఇలాంటి ఉత్పత్తులు అందుబాటులోకి తెస్తే మరింత ప్రయోజనం ఉంటుందని నందా చౌహాన్ చెబుతోంది. తాను పెద్దగా చదువుకోని కారణంగా.. కుమారుడిని బాగా చదివించాలని భావించింది. తల్లి ఆశయాలను కొనసాగిస్తున్న సునిల్ చౌహాన్.. ఏడాది క్రితం "డే స్టార్ సోలార్ కుక్కర్ సొల్యూషన్" అనే పేరుతో కంపెనీని ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ కంపెనీ సోలార్ ఉత్పత్తులకు దేశంతో పాటూ విదేశాల్లోనూ డిమాండ్ పెరిగింది. సునిల్ తన సోలార్ ఉత్పత్తులను లండన్ సహా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాడు. ప్రస్తుతం ఇతడి కంపెనీ ఏడాదికి రూ.30లక్షల టర్నోవర్‌కు చేరుకుంది.