పశువుకు అనారోగ్యంగా ఉండడంతో చూడటానికి వెళ్లిన వైద్యుడు.. మరుక్షణం పెళ్లి మంటపంలో ప్రత్యక్షం.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2022-06-15T22:56:05+05:30 IST
వివాహం అంటే.. అమ్మాయి, అబ్బాయి తరపు వారు మాట్లాడుకుని.. ఇద్దరికీ నచ్చిన తర్వాత ఓ ముహూర్తం ఖాయం చేసుకుంటారు. తర్వాత బంధువులందరినీ పిలిచి ఘనంగా వివాహం చేస్తారు..
వివాహం అంటే.. అమ్మాయి, అబ్బాయి తరపు వారు మాట్లాడుకుని.. ఇద్దరికీ నచ్చిన తర్వాత ఓ ముహూర్తం ఖాయం చేసుకుంటారు. తర్వాత బంధువులందరినీ పిలిచి ఘనంగా వివాహం చేస్తారు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఉన్నట్టుండి ఓ మనిషిని ఎత్తుకెళ్లి వివాహం చేసుకోవడం ఎప్పుడైనా చూశారా.. ఏంటీ! ఇదేమన్నా సినిమానా.. అని అనుకుంటున్నారా, కానీ ఇది నిజం. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఇలాగే జరుగుతుంది. బీహార్‌లో పశువుకు అనారోగ్యంగా ఉండడంతో ఓ వైద్యుడు చూడటానికి వెళ్లాడు. అయితే కాసేపటికి చూస్తే పెళ్లిమండపంలో ఉన్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ యువకుడు పశు వైద్యుడిగా పని చేస్తుంటాడు. ఇటీవల ఓ రోజు అతడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. పశువుకు అనారోగ్యంగా ఉందని చెప్పడంతో వైద్యం చేయడానికి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికి ముగ్గురు వ్యక్తులు వచ్చి.. అతన్ని కిడ్నాప్ చేశారు. కాసేపటికి చూస్తే.. పెళ్లి మండంపంలో ఉన్నాడు. అప్పటికే అక్కడ వధువు పెళ్లి దుస్తుల్లో సిద్ధంగా ఉంది. ఏం జరుగుతుందో అతడికి అర్థమయ్యేలోపే తుపాకీతో బెదిరించి.. తాళి కట్టమని బలవంతపెట్టారు. దీంతో చేసేదిలేక ఆమెను అయిష్టంగానే పెళ్లి చేసుకున్నాడు. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వారిద్దరికీ ఐదేళ్ల క్రితం పరిచయం.. మొదట ఫోన్లో మాత్రమే మాట్లాడే యువకుడు.. ఓరోజు ప్రియురాలు ఒంటరిగా ఉండగా ఇంట్లోకి వెళ్లి..
ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి బలవంతపు వివాహాలు బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో సర్వసాధారణంగా జరుగుతుంటాయట. పెళ్లీడుకొచ్చిన యువతి కుటుంబ సభ్యులు.. ధనవంతులైన అబ్బాయిను వెతుకుతారు. ఎవరైనా నచ్చితే బలవంతంగా ఎత్తుకొచ్చి వివాహం జరిపిస్తారు. ఇలాంటి వివాహాలను అక్కడ 'పకడ్వా షాదీ' అని పిలుస్తారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా.. చాలా మంది యువకులు పోలీసులకు ఫిర్యాదు చేసే ధైర్యం చేయరట. అయితే పశువైద్యుడి తండ్రి ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్త ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.