Gold Fish: అదృష్టం అంటే అది..! చేపల వేటకు వెళ్లిన జాలరికి జాక్‌పాట్.. ప్రపంచంలోనే అత్యంత భారీ గోల్డ్ ఫిష్..
ABN , First Publish Date - 2022-11-23T14:39:15+05:30 IST
బంగారు రంగులో మెరిసిపోతూ అక్వేరియంలో తిరిగే గోల్డ్ ఫిష్‌లు చూపరులను బాగా ఆకట్టుకుంటాయి. చాలా చిన్న సైజులో ఉండే గోల్డ్ ఫిష్‌లు (Goldfish) చాలా అరుదుగా దొరుకుతుంటాయి. అలాంటిది ఫ్రాన్స్ (France)లో ఓ జాలరికి ఏకంగా 30 కేజీల గోల్డ్ ఫిష్ దొరికింది.
బంగారు రంగులో మెరిసిపోతూ అక్వేరియంలో తిరిగే గోల్డ్ ఫిష్‌లు చూపరులను బాగా ఆకట్టుకుంటాయి. చాలా చిన్న సైజులో ఉండే గోల్డ్ ఫిష్‌లు (Goldfish) చాలా అరుదుగా దొరుకుతుంటాయి. అలాంటిది ఫ్రాన్స్ (France)లో ఓ జాలరికి ఏకంగా 30 కేజీల గోల్డ్ ఫిష్ దొరికింది. అంత భారీ గోల్డ్ ఫిష్ తన వలలో పడటంతో ఆ జాలరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బ్రిటన్‌కు చెందిన ఆండీ హాకెట్ అనే మత్స్యకారుడు సుమారు 31 కేజీల గోల్డ్‌ఫిష్‌ను పట్టుకున్నాడు. ఇది ప్రపంచంలోనే అత్యంత బరువైన గోల్డ్‌ఫిష్‌గా రికార్డు సృష్టిస్తోంది.
గతంలో అమెరికాలోని మిన్నసొట్టాలో దొరికిన గోల్డ్‌ఫిష్ కన్నా ఇది సుమారు 14 కేజీల ఎక్కువ బరువు ఉంది. ఫ్రాన్స్‌లోని చాంపేన్‌లో ఉన్న బ్లూవాటర్ సరస్సులో ఆండీ వలకు ఈ చేప చిక్కింది. లెదర్ కార్ప్, కోయి కార్ప్‌కు చెందిన ఈ హైబ్రిడ్ రకం భారీ చేప నారింజపండు రంగులో మెరిసిపోతోంది. దాదాపు 25 నిమిషాల వేట తర్వాత ఆండీకి గోల్డ్‌ఫిష్ దొరికింది. ప్రస్తుతం ఈ ఫిష్‌కి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంత పెద్ద చేపను చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. దీని ధర కోట్లలో పలుకుతుందని అంచనా వేస్తున్నారు.