Home » France
దాదాపు 200 ఏళ్ల క్రితం ఒక పురావస్తు శాస్త్రవేత్త గాజు సీసాలో పెట్టిన సందేశం తాజాగా బయటపడింది. ఫ్రాన్స్‌లోని నార్మాండీ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టిన ఒక వలంటీర్లు సమూహానికి ఈ బాటిల్ దొరికింది. అత్యవసర తవ్వకాలు చేపడుతుండగా ఈ వారంలోనే సందేశం లభ్యమైందని వారు పేర్కొన్నారు.
టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్(Pavel Durov) నిన్న రాత్రి ఫ్రాన్స్(France)లో అరెస్టయ్యారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని బోర్గెట్ విమానాశ్రయంలో పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే ఎందుకు అరెస్ట్ చేశారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పారిస్ ఒలింపిక్స్‌లో ఆటలతో పాటు మరో ‘చిత్రం’ కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. విశ్వక్రీడల ప్రారంభోత్సవంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మానుయల్ మాక్రాన్, ఆ దేశపు క్రీడల మంత్రి అమేలీ ఔడియా కాస్టెరాల ముద్దు ఫొటో ఫ్రాన్స్‌లోనే కాదు...ప్రపంచమంతా ‘హాట్’ టాపిక్ అయింది.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తాజాగా ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. ఓ ‘ముద్దు’ కారణంగా.. నెట్టింట్లో తారాస్థాయి విమర్శలు ఎదుర్కుంటున్నారు. అధ్యక్ష పదవిలో ఉండి..
దేశాల అధినేతలు, అధ్యక్షులు, రాజ కుటుంబీకులు పర్యటించిన సమయంలో ఆతిథ్య దేశం విందు ఇవ్వడం కామన్. బ్రిటన్ రాజ కుటుంబీకులు వస్తే ఖర్చు గురించి చెప్పక్కర్లేదు. రాజ కుటుంబానికి ఫ్రాన్స్ ప్రభుత్వం రాచ మర్యాదలు చేసింది. ఒక్క పూట భోజనం కోసం గ్రాండ్‌గా ఏర్పాటు చేసింది. ఇరు దేశాల అధికారులు, ప్రతినిధులు, డెలిగేట్స్, సినీ తారలు కలిపి 150 మందికి పైగా పాల్గొన్నారు. ఫ్రెంచ్ ఫుడ్, రకరకాల డిషెస్, వైన్, స్విట్ సర్వ్ చేశారు. ఖర్చు ఎంతయ్యిందో అనే విషయం ఆడిట్లో తేలింది.
ఫ్రాన్స్‌తో కలిసి చైనా లాంగ్ మార్చ్ 2 సీ రాకెట్‌ను శనివారం ప్రయోగించింది. నింగిలోకి వెళ్లిన కాసేపటికి రాకెట్‌లోని కొంత భాగం పేలింది. నివాస ప్రాంతానికి సమీపంలో పడటం ఆందోళన కలిగించింది. రాకెట్‌లోని కొంత భాగం భూమి మీద పడే సమయంలో జనం భయంతో పరుగు తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్.. పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఎన్నికల్లో విపక్ష పార్టీ నేషనల్ ర్యాలీ విజయం సాధిస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఆదివారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
విలన్‌ను పోలీసులు అరెస్టు చేసి వ్యాన్‌లో తీసుకువెళ్తారు.. అతని అనుచరులు దారి మధ్యలో కాపుకాసి, వ్యాన్‌ను అడ్డగించి పోలీసులను కాల్చివేసి తమ నాయకుడిని విడిపించుకొని పోతారు.. ఎన్నో సినిమాల్లో ఈ సీన్ చూసి ఉంటారు. అచ్చం అదే తరహాలో ఫ్రాన్స్‌లో ఓ గ్యాంగ్ తమ నాయకుడిని పోలీసుల నుంచి విడిపించుకుపోయింది. పోలీసుల కాన్వాయ్‌ను ఆపి మిషన్ గన్లతో కాల్పులు జరిపి తమ నాయకుడిని తీసుకొని పోయింది. ఈ గ్యాంగ్ జరిపిన దాడిలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు చనిపోయారు.
ఉత్తర ఫ్రాన్స్(France) నుంచి ప్రమాదకరమైన ఇంగ్లిష్ ఛానల్(English Channel)ను దాటేందుకు ప్రయత్నించిన ఓ చిన్నారి సహా ఐదుగురు వలసదారులు(migrants) చనిపోయారు. ఈ మేరకు ఫ్రెంచ్ మీడియా సమాచారం ఇచ్చింది. ఈ ఘటనపై UN శరణార్థుల ఏజెన్సీ, కౌన్సిల్ ఆఫ్ యూరప్ సహా పలు సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్-2024 జాబితాలో భారత్ 85వ ర్యాంకుకు పరిమితమైంది.