Chiranjeevi: నాలో నటుడు ఉన్నాడని గ్రహించింది అప్పుడే ..

ABN , First Publish Date - 2022-11-20T20:41:00+05:30 IST

‘‘నేను నటుణ్ణి కావాలనే బీజం పడింది (Chiranjeevi Attends YNM College Students meet ) వైఎన్‌ఎం కాలేజ్‌లోనే! అక్కడ వేసిన ‘రాజీనామా’ నాటకంలో పాత్రకు ఉత్తమ నటుడిగా బహుమతి అందుకున్నా. అప్పట్లోనే కాలేజ్‌లో అమ్మాయిలు నన్ను హీరోలా చూసేవారు. ఆ రోజే నాలో నటుడు ఉన్నాడని గ్రహించా.

Chiranjeevi: నాలో నటుడు ఉన్నాడని గ్రహించింది అప్పుడే ..

‘‘నేను నటుణ్ణి కావాలనే బీజం పడింది (Chiranjeevi Attends YNM College Students meet ) వైఎన్‌ఎం కాలేజ్‌లోనే! అక్కడ వేసిన ‘రాజీనామా’ నాటకంలో పాత్రకు ఉత్తమ నటుడిగా బహుమతి అందుకున్నా. అప్పట్లోనే కాలేజ్‌లో అమ్మాయిలు నన్ను హీరోలా చూసేవారు. ఆ రోజే నాలో నటుడు ఉన్నాడని గ్రహించా. ఆ లక్ష్యంతోనే ముందుకెళ్లా’’ అని మెగాస్టార్‌ చిరంజీవి (Megastar chiranjeevi) అన్నారు. ఆయన చదివిన నరసాపురం వైఎన్‌ఎం కాలేజ్‌ (YNM college get together) పూర్వ విద్యార్ధుల సమ్మేళనం ఆదివారం హైదరాబాద్‌లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్‌ భవనంలో జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి కూడా పాల్గొని తన చిన్ననాటి మిత్రులను కలిశారు. ఉదయం 10.30 నిమిషాలకు విచ్చేసిన ఆయన మధ్యాహాన్నం 2 గంటల వరకూ కాలేజ్‌లో సీనియర్స్‌, జూనియర్స్‌, మిత్రులతో కలిసి సరదాగా గడిపారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఈ కార్యక్రమంలో గురించి చెప్పగానే చాలా ఎగ్జైట్‌ అయ్యా. (Chiranjeevi college memories)అయితే షూటింగ్‌ వల్ల కుదురుతుందో లేదో అని ఆలోచించా. కానీ గతంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం గురించి తెలుసుకున్నాక తప్పకుండా హాజరు కావాలనిపించింది. ఇక్కడికి రావడానికి ముందు రోజు ‘వాల్తేరు వీరయ్య’ సెట్‌లో అదోలా ఉండడం గమనించిన దర్శకుడు ‘ఏం సార్‌ ఆరోగ్యం బాగోలేదా? షూటింగ్‌ క్యాన్సిల్‌ చేద్దామా? అనడిగారు. అలా ఏం లేదు.. రేపు మా కాలేజ్‌ పాత మిత్రులు అందరినీ కలవబోతున్నా... చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. అప్పటి రోజులు గుర్తొచ్చాయి.. అందుకే’ అని అన్నాను. నిజంగా.. నాకు కాలేజ్‌ రోజులు కళ్ల ముందు మెదిలాయి. అక్కడి గోదావరి, కాలేజీ ఆవరణ, షెడ్డులు, మరిచెట్లు ఇలా అన్ని కళ్ల ముందుకొచ్చి కొత్త అనుభూతిని కలిగించాయి. అదే ఉత్సాహంతో ఇక్కడికి వచ్చాను. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయం. ఒక్కసారిగా ఆనాటికి వెళ్లిపోయా. నల్లని జుట్టు, నల్లటి మీసం, బాడీ తగ్గించడం యంగ్‌ అని నేను అనుకోను. మనం ఫిజికల్‌గా యంగ్‌గా ఉండడం కాదు. మనసు యంగ్‌గా ఉండాలని నేను నమ్ముతాను. నేను అదే ఫాలో అవుతా. మన ఆలోచనలు, ఆచరణలు యంగ్‌గా ఉండాలి. యంగ్‌ ఎట్‌ హార్ట్‌ ఉంటేనే మనం పాజిటివ్‌గా ఉండగలం. అదే మనల్ని యూత్‌ఫుల్‌గా ఉంచుతుంది. నేను ఈ రోజు గురించే ఆలోచిస్తా. భవిష్యత్తు ఏంటి? ఏ మైపోతుందో అన్ని భయాందోళన మనసులోకి తీసుకురాను. అలాంటి ఆలోచనలు ఉంటే దగ్గరకు రానివ్వను. ప్రజంట్‌లో ఉండటానికే ఇష్టపడతా. అదే మనల్ని యంగ్‌గా ఉంచుతుంది. 

నేను ఈరోజు క్రమశిక్షణ, సర్దుకుపోయే గుణం, కష్టపడే తత్వం, సమయపాలనలో పర్ఫెక్ట్‌గా ఉన్నానంటే  ఎన్‌సీసీ కారణం. ఇది కూడా వైఎన్‌ఎం కాలేజ్‌లోనే అలవాటైంది. ఎన్‌సీసీ ఫోర్‌ ఆంధ్రా నావెల్‌ యూనిట్‌ నరసాపురంలో సీనియర్‌ కెడెడ్‌ కెప్టెన్‌ వరకూ వెళ్లా. అందులోనూ హయ్యస్ట్  పీక్స్‌ని చూశా.  ఏదైనా ఒకటి తలిస్తే అంతు చూడడం అలవాటైంది. అయితే అది నా మనసులోంచి రాకపోతే నేను దాని అంతు చూడలేను. అలా నేను రాణించలేని రంగం ఏంటో అందరికీ తెలుసు(రాజకీయాలను ఉద్దేశించి). అందుకే మళ్లీ వెనక్కి వచ్చేశా’’ అని చిరంజీవి అన్నారు. 


Updated Date - 2022-11-20T21:23:10+05:30 IST