Indian Currency గురించి మీకు తెలియని నిజాలు.. గాంధీజీ ఫొటోను మొదటిసారి కరెన్సీ నోట్లపై ఎప్పుడు ముద్రించారో తెలుసా..?

ABN , First Publish Date - 2022-10-28T18:18:27+05:30 IST

కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీతో పాటు లక్ష్మీ దేవి, వినాయకుడి ఫొటోలను కూడా ముద్రించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేయడం కొత్త చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఇండియన్ కరెన్సీ గురించిన ఈ ఆసక్తికర అంశాలు మీకు తెలుసా?

Indian Currency గురించి మీకు తెలియని నిజాలు.. గాంధీజీ ఫొటోను మొదటిసారి కరెన్సీ నోట్లపై ఎప్పుడు ముద్రించారో తెలుసా..?

ప్రస్తుతం దేశంలో కరెన్సీ నోట్ల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీతో పాటు లక్ష్మీ దేవి, వినాయకుడి ఫొటోలను కూడా ముద్రించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేయడం కొత్త చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఇండియన్ కరెన్సీ గురించిన ఈ ఆసక్తికర అంశాలు మీకు తెలుసా?

1)భారతదేశంలో మొదటిసారిగా రూపాయి నోటును 1949 సంవత్సరంలో ముద్రించారు.

2)భారత కరెన్సీపై మొదటిసారిగా మహాత్మా గాంధీ ఫోటోను 1969లో ముద్రించారు.

3)భారత కరెన్సీపై ఉన్న గాంధీ ఫొటోను 1946లో తీశారు.

4)RBI ఇప్పటివరకు ముద్రించిన అత్యధిక విలువ కలిగిన నోటు- 10,000 నోటు.

5)ప్రతి బ్యాంకు నోటుపై 17 భాషల లిపిలో దాని విలువ రాసి ఉంటుంది.

6)భారతీయ కరెన్సీపై ముద్రితమైన ఒకే ఒక విదేశీ భాష నేపాలీ.

7)భారతదేశంలో మొదటి పేపర్ కరెన్సీ 1882 నుంచి అమల్లోకి వచ్చింది.

8)కరెన్సీ తయారీకి ఉపయోగించే కాగితం, మరిన్ని భద్రతా పత్రాలు సెక్యూరిటీ పేపర్ మిల్ (హోషంగాబాద్, మధ్యప్రదేశ్) లో తయారవుతాయి.

9)కరెన్సీ నోట్లు నాసిక్, దేవాస్, మైసూర్, సాల్బోనిలో ముద్రితమవుతాయి.

10)ఒక రూపాయి నాణెం 1962 సంవత్సరంలో విడుదల అయింది.

Updated Date - 2022-10-28T18:18:29+05:30 IST