కుక్కలు గూగుల్‪ని వినియోగిస్తే.. దేనికోసం శోధిస్తాయో.. మీకు తెలుసా.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

ABN , First Publish Date - 2022-06-22T21:33:03+05:30 IST

కుక్కలు విశ్వాసానికి మారు పేరు. కొన్ని కుక్కలు అందరినీ ఆశ్చర్యపరచేలా ప్రవర్తిస్తుంటాయి. మరికొన్ని కుక్కలు మనుషుల కంటే చాలా తెలివిగా ఆలోచిస్తాయి. కుక్కలు అచ్చం మనిషిలా..

కుక్కలు గూగుల్‪ని వినియోగిస్తే.. దేనికోసం శోధిస్తాయో.. మీకు తెలుసా.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

కుక్కలు విశ్వాసానికి మారు పేరు. కొన్ని కుక్కలు అందరినీ ఆశ్చర్యపరచేలా ప్రవర్తిస్తుంటాయి. మరికొన్ని కుక్కలు మనుషుల కంటే చాలా తెలివిగా ఆలోచిస్తాయి. కుక్కలు అచ్చం మనిషిలా ఆలోచిస్తే ఎలా ఉంటుంది. ఇదే సందేహం నెట్ దిగ్గజం గూగుల్‌కు కూడా వచ్చింది. ప్రస్తుత హైటెక్ యుగంలో మనిషికి ఏం సమాచారం కావాలన్నా చిటికెలో చేతిలోకి వచ్చి చేరుతుంది. గూగుల్‌లో సర్చ్ చేస్తే తెలియని సమాచారం అంటూ ఉండదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ కుక్కలు గూగుల్‌ను వినియోగిస్తే.. దేనికోసం వెతుకుతాయి. ఇదే ప్రశ్న గూగుల్.. తమ ట్విటర్ ద్వారా నెటిజన్లను అడిగింది.


కుక్కలపై నెటిజన్ల నుంచి అభిప్రాయాలు తెలుసుకునేందుకు గూగుల్.. జూన్ 22న ట్విట్టర్‌లో పోస్టును షేర్ చేసింది. మనం ఏ ప్రశ్నకు సమాధానం కావాలన్నా, ఏ వివరాలు కావాలన్నా Googleకి వెళ్తాం. కానీ మీ కుక్క గూగుల్‌ను వినియోగిస్తే.. దేని కోసం వెతుకుతుందో మీరు ఎప్పుడైనా ఊహించారా? అంటూ.. "మీ కుక్క Googleని ఉపయోగించగలిగితే, అది దేని కోసం శోధిస్తుంది?" అని ప్రశ్నించింది. దీనిపై నెటిజన్లు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు.

కనీవినీ ఎరుగని రీతిలో శునకాలకు పెళ్లి.. బంధువులందరికీ భోజనాలు.. డీజే పాటలతో ఊరంతా సందడే సందడి..!


‘‘ఎముకలు’’ అని ఒరు, “పెట్ స్నాక్స్” అని మరొకరు పేర్కొన్నారు. ఇంకా మరికొందరు ఈ విధంగా వ్యాఖ్యానించారు. ‘'నేను ఎక్కువ ఆహారం ఎలా పొందగలను'’, ‘‘నా యజమాని నన్ను వాకింగ్‌కు తీసుకెళ్లేలా ఎలా చేయాలి’’, ‘‘నా యజమానిని ఎలా సంతోషపెట్టాలి’’, ‘‘ఎక్కువ కుక్కీలను ఎలా పొందాలి’’.. ఇలా వివిధ రకాలుగా నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న రంగు రంగుల స్కూటర్.. ఇంతకీ దాని ప్రత్యేకతలు ఏంటో తెలుసా..





Updated Date - 2022-06-22T21:33:03+05:30 IST