NASA: నాసా శాస్త్రవేత్తల వింత ఆచారం.. రాకెట్ ప్రయోగానికి ముందు అవి తిని తీరాల్సిందేనట.. లేదంటే..

ABN , First Publish Date - 2022-07-10T01:05:01+05:30 IST

ఈ రోజుల్లో మూఢనమ్మకాలు, సెంటిమెంట్లు ఫాలో అయితే.. ఏంటీ చాదస్తం అంటారు.. దాదాపు మూఢనమ్మకాలను నమ్మడం ప్రజలు ఎప్పుడో మానేశారు. కానీ సెంటిమెంట్లను నమ్ముకోవడం..

NASA: నాసా శాస్త్రవేత్తల వింత ఆచారం.. రాకెట్ ప్రయోగానికి ముందు అవి తిని తీరాల్సిందేనట.. లేదంటే..

ఈ రోజుల్లో మూఢనమ్మకాలు, సెంటిమెంట్లు ఫాలో అయితే.. ఏంటీ చాదస్తం అంటారు.. దాదాపు మూఢనమ్మకాలను నమ్మడం ప్రజలు ఎప్పుడో మానేశారు. కానీ సెంటిమెంట్లను నమ్ముకోవడం మాత్రం ఇప్పటికీ కొంతమంది నమ్ముతూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా శాస్త్రవేత్తలు.. మనదేశంలో ఏదైనా రాకెట్ ప్రయోగం చేపట్టే ముందు ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీహరికోటలోని స్థానిక అమ్మవారి ఆలయంలో పూజలు చేస్తారు. అలాగే అమెరికాలో కూడా ఒక సెంటిమెంట్‌ను ఫాలో అవుతారు. అదే వేరుశెనగలను తినే ఆచారం.


నాసా ఏదైనా మిషన్‌ను ప్రారంభించే ముందు పల్లీలు తింటారు. ఇది వారి ఆచారంగా, ఒక సెంటిమెంట్‌గా నాసా శాస్త్రవేత్తలు దశాబ్దాల నుంచి ఫాలో అవుతున్నారు. అప్పుడు ఆ మిషన్ విజయవంతమవుతుంది. అందుకే రాకెట్ ప్రయోగం నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా.. సైంటిస్టులు పల్లీలు తింటారు. అయితే ఇలా ఎందుకు చేస్తారు.. అంటే 1960లో రేంజర్‌-7 అనే విమానం ప్రయోగం ఆరుసార్లు విఫలమైంది. ఆరుసార్లు ఫెయిల్ అయినా.. ఆ ప్రయత్నం మానుకోలేదు. ఏడోసారి కూడా విమానాన్ని సిద్ధం చేశారు.

Viral Video: తమ్ముడిపై ఈ అన్నకు ఎంత ప్రేమో.. పక్కన కూర్చుని.. ముద్దు పెట్టి మరీ ధైర్యం చెబుతున్నాడు..


కానీ.. అందరిలోనూ భయం, ఆందోళన.. మిషన్ ఎక్కడ ఫెయిల్ అవుతుందో అని.. ఆ సమయంలోనే సైంటిస్టులో ఒకరు వచ్చి పల్లీలు తినండి.. అవి తింటే టెన్షన్ తగ్గుతుందని చెప్పారట. ఆ తర్వాత రేంజర్ ఎయిర్ క్రాఫ్ట్ విజయవంతంగా గాల్లోకి ఎగిరింది. అప్పటి నుంచీ NASA శాస్త్రవేత్తలు వేరుశెనగలను తినడం ఒక ఆచారంగా మలుచుకున్నారు. మిషన్ లాంచ్‌ చేసే సమయంలో పల్లీలు తింటే అంతా సవ్యంగా జరుగుతుందని విశ్వసిస్తారు. అయితే ప్రజలకు చెప్పాల్సిన శాస్త్రవేత్తలు ఇలా సెంటిమెంట్లు, మూఢనమ్మకాలను నమ్మడమేంటని ఈ విషయం తెలిసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

ఈ మొక్క మీ ఇంట్లో ఉందా.. అయితే ప్రాణాలు జాగ్రత్త..!



Updated Date - 2022-07-10T01:05:01+05:30 IST