ఓ మహిళ గొంతులోంచి డాక్టర్లు బయటకు తీసిన ఈ వింత పదార్థమేంటో తెలిస్తే అవాక్కవడం ఖాయం..!
ABN , First Publish Date - 2022-12-07T19:00:04+05:30 IST
కొందరు వింత వింత సమస్యలతో ఆస్పత్రులకు వెళ్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో వైద్యులకు కొన్ని ఆపరేషన్లు సవాల్‌గా మారుతుంటాయి. రాజస్థాన్‍లో ఇటీవల ..
కొందరు వింత వింత సమస్యలతో ఆస్పత్రులకు వెళ్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో వైద్యులకు కొన్ని ఆపరేషన్లు సవాల్‌గా మారుతుంటాయి. రాజస్థాన్‍లో ఇటీవల ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ మహిళ వింత సమస్యతో రెండు నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడింది. చివరకు శ్వాసతీసుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. ఎట్టకేలకు వైద్యులు విజయంతంగా ఆపరేషన్ చేసి.. ఆమె గొంతు నుంచి ఓ వింత పదార్థాన్ని బయటికి తీశారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
కళ్లల్లో కారం కొట్టి డబ్బులు దోచుకెళ్లారని ఫిర్యాదు.. చివరకు సీసీ కెమెరాలు చూసి ఖంగుతిన్న పోలీసులు..
రాజస్థాన్ (Rajasthan) జైపూర్ పరిధి బికనీర్‌కు చెందిన 47ఏళ్ల మహిళకు.. రెండు నెలల క్రితం విచిత్రమైన సమస్య (Strange problem) ఎదురైంది. తమళపాకు తింటుండగా పొరపాటున గొంతులో ఇరుక్కుపోయింది. తర్వాత శ్వాసనాళలోకి చేరిపోయింది. దీంతో మహిళ శ్వాస తీసుకోవడంలో సమస్య ఏర్పడింది. అప్పటి నుంచి జల్లాలోని ఆస్పత్రుల (Hospitals) చుట్టూ తిరుగుతోంది. పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేస్తే మహిళ చనిపోయే అవకాశం ఉందని ముందుకు రాలేదు.
పెళ్లి చూపుల్లో యువతి నంబర్ తీసుకున్న యువకుడు.. ఓ రోజు ఫోన్ చేసి ఊరి బయటికి రమ్మని చెప్పి..
రెండు నెలలుగా తమలపాకు లోపలే ఉండడంతో ఉబ్బిపోయి.. శ్వాస తీసుకోవడం మరింత సమస్యగా మారింది. ఒక శ్వాసనాళం మూసుకుకోవడంతో రెండో శ్వాసనాళం ద్వారా ఊపిరి తీసుకునేది. దీంతో చివరకు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఆస్పత్రి వైద్యులను సంప్రదించింది. పరీక్షించిన వైద్యులు మహిళ గొంతులో నాలుగు సెంటీమీటర్ల తమలపాకు ఉన్నట్లు గుర్తించారు. చివరకు ఆమెకు ఎలాంటి కోతలు పెట్టకుండా... బ్రోంకోస్కోపీ టెక్నిక్ (bronchoscopy technique) సాయంతో సుమారు గంటపాటు శ్రమించి విజయవంతంగా బయటికి తీశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.