Elon Musk: వైరల్ అవుతున్న ఫొటో.. మస్క్ తన అసలు రంగు బయటపెట్టాడా..
ABN , First Publish Date - 2022-11-28T20:32:59+05:30 IST
ట్విటర్ , టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తాజాగా చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ట్విటర్(Twitter), టెస్లా(Tesla) సంస్థల అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) తాజాగా చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. తన మంచం పక్కన ఉండే బల్లపై(Bedside Table) ఉన్న వస్తువులు ఏంటో చూపెడుతో ఆయన ఓ ఫొటో ట్వీట్ చేశారు. ఆ ఫొటోలోని టేబుల్‌పై ఓ బొమ్మ తుపాకీతో పాటూ 19వ శతాబ్దం నాటి పురాతన తుపాకీ కూడా ఉంది. ఆ పక్కనే నాలుగు కోక్ టిన్స్ కూడా దర్శనమిచ్చాయి. అయితే.. నెటిజన్ల దృష్టి అక్కడున్న రివాల్వర్‌లపై(Revolvers) పడింది. అవి నిజమైనవా కావా అన్న దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ.. నెటిజన్లు మాత్రం మస్క్ తన అసలు రంగు బయటపెట్టాడని, తుపాకీ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాడంటూ సరదా కామెంట్లు చేశారు. మస్క్‌కు మానవతావాదిగా, శాంతిని కోరుకునే వ్యక్తిగా పేరున్న విషయం తెలిసిందే.
మరికొందరు అక్కడున్న కోక్ టిన్స్‌పై(Coke tins) దృష్టిసారించారు. కెఫీన్‌తో నిండిన ఈ కూల్ డ్రింక్స్ అనారోగ్య కారకాలు కాదా అని సందేహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. ఈ ఆహారపు అలవాట్లు మస్క్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం కూడా చూపిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం మస్క్ ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతోంది. పోస్ట్ పెట్టిన గంటలోపే దాదాపు 70 వేల లైకులు వచ్చిపడ్డాయి. కాగా.. మరో ట్వీట్‌లో మస్క్ వెరిఫైడ్ టిక్ మార్కుల గురించి ప్రస్తావించారు. వచ్చే శుక్రవారం నుంచి ఈ సర్వీసు అందుబాటులోకి రావచ్చని పేర్కొన్నారు. కంపెనీలకు బంగారం రంగులోని టిక్ మార్కులు, ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలకు బూడిదె రంగు టిక్ మార్కులు ఇస్తామన్నారు. వ్యక్తులకు మాత్రం ఎప్పటిలాగే నీలిరంగు టిక్ మార్క్స్ ఇస్తామన్నారు. సెలబ్రిటీలకు కూడా నీలిరంగు టిక్ మార్క్‌ను కేటాయిస్తామని స్పష్టంచేశారు.