Viral Video: నడుస్తూ వెళ్తున్న యువతి ఫోన్‌ను లాక్కెళ్లిన దొంగ.. చివరకు అతన్ని పట్టుకుని చూడగా..

ABN , First Publish Date - 2022-08-28T23:27:37+05:30 IST

ఎంతవరకు నిజమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు ఫేమస్ కావాలనే ఉద్దేశంతో ప్రాంక్ వీడియోలు ..

Viral Video: నడుస్తూ వెళ్తున్న యువతి ఫోన్‌ను లాక్కెళ్లిన దొంగ.. చివరకు అతన్ని పట్టుకుని చూడగా..

ఎంతవరకు నిజమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు ఫేమస్ కావాలనే ఉద్దేశంతో ప్రాంక్ వీడియోలు (Prank videos) చేస్తుండగా.. మరికొన్ని సార్లు ఎవరూ ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. కొన్నిసార్లు ప్రేమికులు ఒకరినొకరు మోసం చేసుకోవడం, దాడులు చేసుకోవడం చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. నడుస్తూ వెళ్తున్న యువతి ఫోన్‌ను.. ఓ యువకుడు బైకులో వెళ్తూ లాక్కెళ్తాడు. స్థానికులు గమనించి.. వెంబడించి మరీ అతన్ని పట్టుకుంటారు. చివరకు అతడు ఎవరో తెలిసి అంతా ఆశ్చర్యపోతారు.. 


ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో వైరల్ (Instagram viral videos) అవుతోంది. ఓ యువతి ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్డుపై నడుస్తూ వెళ్తుంటుంది. ఆమెను ఓ వ్యక్తి వెనుక నుంచి గమనిస్తూ.. బైకులో వస్తుంటాడు. దగ్గరలో ఎవరూ లేని సమయం చూసి, ఒక్కసారిగా ఫోన్ లాక్కుని పారిపోతాడు. ఈ క్రమంలో ఆమె సడన్‌గా కిందపడిపోతుంది. షాక్ నుంచి తేరుకుని గట్టిగా కేకలు పెడుతుంది. దీంతో సమీపంలో ఉన్న వారు అతన్ని  బైకులో వెంబడిస్తారు. చివరకు ఎలాగోలా అతన్ని పట్టుకుని, చేతులు కట్టేసి ఆమె వద్దకు తీసుకొస్తారు. తీరా అతడి మొఖం చూసి ఆమె షాక్ అవుతుంది. వీడు ఎవడో కాదు.. నేను ప్రేమించిన వాడే.. అంటూ కన్నీటిపర్యంతమవుతుంది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కవుతారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 

tragic incident: తాగుతూ తూలుతూ ఇంటికొచ్చిన భర్త.. అర్ధరాత్రవుతున్నా పదే పదే ఒకే విషయంలో భార్య వ్యతిరేకిస్తుండడంతో.. చివరకు..





Updated Date - 2022-08-28T23:27:37+05:30 IST