ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు వాడే గదిలో కుళ్లిపోయిన స్థితిలో ఓ మహిళ శవం.. ఎవరిదా అని ఆరా తీస్తే..

ABN , First Publish Date - 2022-04-21T18:09:26+05:30 IST

అదొక రద్దీగా ఉండే ప్రముఖ ప్రభుత్వాస్పత్రి. నిత్యం ఎంతో మంది రోగులకు వివిధ రకాల చికిత్స, ఆపరేషన్లు చేస్తుంటారు. ఈ ఆస్పత్రిలో ఎంతోమంది వైద్య చికిత్స చేయించుకుని..

ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు వాడే గదిలో కుళ్లిపోయిన స్థితిలో ఓ మహిళ శవం.. ఎవరిదా అని ఆరా తీస్తే..

అదొక రద్దీగా ఉండే ప్రముఖ ప్రభుత్వాస్పత్రి. నిత్యం ఎంతో మంది రోగులకు వివిధ రకాల చికిత్స, ఆపరేషన్లు చేస్తుంటారు. ఈ ఆస్పత్రిలో ఎంతోమంది వైద్య చికిత్స చేయించుకుని ఆరోగ్యంగా ఇంటికి వెళ్తుంటారు. అలాగే కొన్నిసార్లు దురదృష్టవశాత్తు కొందరు ప్రాణాలు కోల్పోతుంటారు. ఇవన్నీ అక్కడ సర్వసాధారణమే. అయితే తాజాగా ఈ ఆస్పత్రిలో ఓ మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడి ఉండడం సంచలనం కలిగిస్తోంది. దీంతో వైద్య సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


తమిళనాడు రాష్ట్రం తిరుచిరపల్లి జిల్లా మన్నచనల్లూర్‌లోని ప్రభుత్వస్వాత్రికి ఎక్కడెక్కడినుంచో నిత్యం ఎంతో మంది రోగులు వస్తుంటారు. ఈ క్రమంలో ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్ పక్కన ఉండే గదిలో ఓ మహిళ మృతదేహం బయటపడడం సంచలనం కలిగించింది. ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లే ముందు వైద్యులు, సిబ్బంది దుస్తులు మార్చుకోవడానికి పక్కనున్న గదిలోకి వెళ్తుంటారు. బుధవారం యథావిధిగా వైద్య సిబ్బంది ఆ గదిలోకి వెళ్లగా.. లోపల 70ఏళ్ల వృద్ధురాలి మృతదేహం ఉండడం చూసి షాక్ అయ్యారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు.

ప్రియుడు అడిగాడని స్నానం చేసే సమయంలో వీడియో కాల్ చేసింది... ఎలాగైనా కలవాలంటూ కొన్నాళ్ల తర్వాత అతడి నుంచి మెసేజ్.. తీరా చూస్తే..


మృతురాలు.. మన్నచనల్లూరులోని సౌత్ లేక్ మిషన్ స్ట్రీట్‌కు చెందిన ఎం. శివబాక్యంగా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వృద్ధురాలు రెండు రోజుల కిందట చనిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆస్పత్రిలో ఉండే రోగులకు సహాయకారిగా ఉంటూ, వారికి అవసరమయ్యే వస్తువులను బయటి నుంచి తీసుకొస్తుంటుందని విచారణలో తెలిసింది. అయితే వృద్ధురాలు ఆ గదిలోకి ఎందుకు వెళ్లింది, ఆమె మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

వంట చేయకుండా ఇంతసేపు ఏం చేస్తున్నావ్.. అంటూ మండిపడ్డ భర్త... చివరకు భార్యకు బలవంతంగా..

Updated Date - 2022-04-21T18:09:26+05:30 IST