వివాహ వేదికపై వధువుకు పురిటినొప్పులు.. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిన వరుడు.. చివరకు ఆస్పత్రిలో..
ABN , First Publish Date - 2022-10-30T21:32:57+05:30 IST
వారిద్దరూ తమ వివాహ కార్యక్రమం కలకాలం గుర్తుండేలా ఘనంగా నిర్వహించాలని అనుకున్నారు. అనుకున్నట్లే ఏర్పాట్లు కూడా ఆర్భాటంగా చేశారు. బంధువులు, సన్నిహితులు, స్నేహితులంతా మంటపానికి చేరుకున్నారు. వివాహ క్రతువు చివరి అంకానికి చేరుకుంది. అయితే..
వారిద్దరూ తమ వివాహ కార్యక్రమం కలకాలం గుర్తుండేలా ఘనంగా నిర్వహించాలని అనుకున్నారు. అనుకున్నట్లే ఏర్పాట్లు కూడా ఆర్భాటంగా చేశారు. బంధువులు, సన్నిహితులు, స్నేహితులంతా మంటపానికి చేరుకున్నారు. వివాహ క్రతువు చివరి అంకానికి చేరుకుంది. అయితే అకస్మాత్తుగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వధువుకు పురిటినొప్పులు రావడంతో తల్లడిల్లిపోయింది. కాసేపటికి ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మరోవైపు మంటపానికి వచ్చిన బంధువులంతా అటునుంచి అటే ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
Viral Video: లేటు వయసులోనూ ఈ బామ్మ వేసిన లేటెస్ట్ స్టెప్పులకు.. నెటిజన్లు ఫిదా..
నెదర్లాండ్స్‌లోని ( Netherlands) డోడ్రెచ్ట్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నికోల్, మార్క్‌ల వివాహాన్ని అక్టోబర్ 26న ఏర్పాటు చేశారు. వివాహ కార్యక్రమం కలకాలం గుర్తుండేలా ఘనంగా నిర్వహించాలని అనుకున్నారు. అనుకున్నట్లే ఏర్పాట్లు కూడా ఆర్భాటంగా చేశారు. బంధువులు, సన్నిహితులు, స్నేహితులంతా మంటపానికి చేరుకున్నారు. పెళ్లి వేడుక జరుగుతుండగా.. అకస్మాత్తుగా ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వధువు పురిటినొప్పులతో విలవిలలాడిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటపంలో గందరగోళ వాతావరణం నెలకొంది.
Viral Video: ఆస్పత్రిలో మహిళ పట్ల సిబ్బంది నిర్వాకం.. అంతా చూస్తుండగా..
వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాసేపటికి ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో బంధువులు అయోమయంలో ఉండగా, వరుడు మాత్రం సంతోషంగా కనిపించాడు. వివాహానికి ముందే వధువు గర్భిణిగా ఉంది. అయితే డెలివరీ సమయానికి ముందే పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ గడువు తేదీ కంటే 5వారాల ముందే ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత అదే ఆస్పత్రిలోని ఓ గదిలో వివాహ ఏర్పాట్లు చేశారు. వివాహ కార్యక్రమం పూర్తవడంతో బంధువులంతా శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడికి చేరుకున్న మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అధికారులు.. ఇది అరుదైన వివాహమంటూ కితాబిచ్చారు. మొత్తానికి ఈ వార్త సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.
Viral Video: కళ్యాణ మంటపంపై వధువు ఎదుట ఫొటోగ్రాఫర్ అత్యుత్సాహం.. ఓపికతో భరించిన వరుడు.. చివరకు..