కాసేపట్లో పెళ్లనగా వరుడికి మైండ్‌బ్లాక్.. వధువుకు వేరే కుర్రాడితో పెళ్లి చేసిన తండ్రి.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2022-05-17T16:58:32+05:30 IST

చిన్న చిన్న కారణాల వల్ల పెళ్లిళ్లు ఆగిపోయిన ఘటనలు చాలా చూశాం. పెళ్లి పీటలు ఎక్కిన తర్వాత అనూహ్య ఘటనలు చోటు చేసుకోవడం వల్ల పెళ్లిళ్లు రద్దవుతుంటాయి. కట్నం విషయంలో తేడాలు...

కాసేపట్లో పెళ్లనగా వరుడికి మైండ్‌బ్లాక్.. వధువుకు వేరే కుర్రాడితో పెళ్లి చేసిన తండ్రి.. అసలు కథేంటంటే..

చిన్న చిన్న కారణాల వల్ల పెళ్లిళ్లు ఆగిపోయిన ఘటనలు చాలా చూశాం. పెళ్లి పీటలు ఎక్కిన తర్వాత అనూహ్య ఘటనలు చోటు చేసుకోవడం వల్ల పెళ్లిళ్లు రద్దవుతుంటాయి. కట్నం విషయంలో తేడాలు రావడం వల్ల చాలా సార్లు ఇలాంటి సమస్య తలెత్తుతుంటుంది. అయితే హర్యానాలో మాత్రం విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా.. వరుడికి మైండ్ బ్లాక్ అయింది. వధువుకు వేరే యువకుడిని ఇచ్చి పెళ్లి చేయడం.. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే...


హర్యానా రాష్ట్రం సియోని పరిధి తెహసీల్‌లోని చెలనా బాస్ గ్రామంలో  సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో మంగళవారం ఓ వివాహ కార్యక్రమం జరగాల్సి ఉంది. దీంతో సోమవారం రాత్రి వరుడి తరపు వారు ఊరేగింపు నిర్వహించారు. వధువు గ్రామానికి ఊరేగింపుగా బయలుదేరారు. ఈ సందర్భంగా సుమారు వంద మంది పాల్గొని, డ్యాన్సులు చేస్తూ రచ్చ రచ్చ చేశారు. మరోవైపు పెళ్లి కుమారుడి కోసం వధువు కుటుంబ సభ్యులంతా ఎదురు చూస్తున్నారు. రాత్రి 2గంటలవుతున్నా వరుడు చేరుకోకపోవడంతో అంతా కంగారుగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వేకువజాము 3గంటల సమయంలో ఊరేగింపు వధువు గ్రామానికి చేరుకుంది.

తాళి కట్టిన తర్వాత ఎంటరైన పోలీసులు... కాసేపటికి భర్త స్థానంలో మరిది ప్రత్యక్షం... జరిగిన విషయం తెలుసుకుని అవాక్కయిన బంధువులు


పలువురు యువకులు డ్యాన్సులు చేస్తూ అల్లరి చేస్తుండడం వధువు తరపు వారికి నచ్చలేదు. దీంతో ఇది మంచి పద్ధతి కాదంటూ యువకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వరుడితో పాటూ వారి బంధువులు ఎవరూ వినిపించుకోలేదు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. వరుడి ప్రవర్తనతో విసిగిపోయిన వధువు తండ్రి.. సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన కుమార్తెను వేరే యువకుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. దీంతో గొడవ మరింత పెద్దదై.. పోలీస్ స్టేషన్‌ వరకూ వెళ్లింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. 

అంతా చూస్తుండగా... గుర్రంపై వరుడు పరార్.. అసలు కారణం తెలిస్తే నవ్వు ఆపుకోలేరు..

Updated Date - 2022-05-17T16:58:32+05:30 IST