Fire Haircut: ‘ఫైర్ హెయిర్‌కట్’లో పెద్ద తప్పిదం..

ABN , First Publish Date - 2022-10-27T16:50:00+05:30 IST

ఈ రోజుల్లో యువత ట్రెండింగ్ హెయిర్‌స్టైల్స్‌పై మక్కువ చూపుతున్నారు. తమకు నచ్చిన స్టైల్ కోసం డబ్బు కాస్త ఎక్కువైనా వెనుకాడడం లేదు. ఈ క్రమంలో కొందరు ఏమాత్రం నెరవకుండా కొత్త పద్ధతులను ట్రై చేస్తున్నారు.

Fire Haircut: ‘ఫైర్ హెయిర్‌కట్’లో పెద్ద తప్పిదం..
fire haircu

వల్సాడ్, గుజరాత్: ఈ రోజుల్లో యువత ట్రెండింగ్ హెయిర్‌స్టైల్స్‌పై మక్కువ చూపుతున్నారు. తమకు నచ్చిన స్టైల్ కోసం డబ్బు కాస్త ఎక్కువైనా వెనుకాడడం లేదు. ఈ క్రమంలో కొందరు ఏమాత్రం నెరవకుండా కొత్త పద్ధతులను ట్రై చేస్తున్నారు. ఇలా ఓ కొత్త పద్ధతిని ప్రయత్నించిన ఓ యువకుడికి పెద్ద ప్రమాదం జరిగింది. గుజరాత్‌లోని వల్సాడ్‌లో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

గుజరాత్‌లోని వల్సాడ్ జిల్లా వపీ పట్టణానికి చెందిన 18 ఏళ్ల యువకుడు హెయిర్‌ కటింగ్ (Hair cut) కోసం సెలూన్‌కి వెళ్లాడు. ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకున్నాడో ఏమో.. ఇటివల బాగా ప్రాచుర్యం పొందిన ‘ఫైర్ హెయిర్‌కట్’ను (Fire haircut) ప్రయత్నించాడు. కానీ దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగింది. కటింగ్ ప్రక్రియలో బార్బర్ నిప్పు (fire) ఉపయోగిస్తున్న సమయంలో మంటలు నియంత్రణ తప్పాయి. దీంతో సదరు యువకుడికి మంటలు అంటుకుని కాలిన గాయాలయ్యాయి. దీంతో మెడ, ఛాతిపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే హాస్పిటల్‌కు తరలించి వైద్యం అందించారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో నగరంలోని సివిల్ హాస్పిటల్‌కు తరలించి వైద్యం అందించారని పోలీసులు వెల్లడించారు. బాధిత యువకుడు, బార్బర్‌ల నుంచి స్టేట్‌మెంట్స్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని దర్యాప్తు జరుపుతున్న పోలీసు అధికారి కరమ్‌సిన్హ్ మక్వానా తెలిపారు. ఫైర్ హెయిర్ కట్ కోసం ఒక రకమైన రసాయనాన్ని ఉపయోగించారని, దీంతో బాధిత యువకుడికి తీవ్ర కాలిన గాయాలయ్యాయని వివరించారు.

Updated Date - 2022-10-27T16:54:15+05:30 IST