Frilled Dragons: గొడవకు తగ్గేదేలే.. రెండు కాళ్లపై లేస్తాయి.

ABN , First Publish Date - 2022-11-12T12:15:56+05:30 IST

జంతువులతో తగాదాకు దిగవలసి వచ్చినా, బెదిరినా ఇవి రెండు కాళ్లపైనా లేస్తాయి.

Frilled Dragons: గొడవకు తగ్గేదేలే.. రెండు కాళ్లపై లేస్తాయి.
Frilled Dragons

ఫ్రిల్డ్ డ్రాగన్ (క్లామిడోసారస్ కింగి) ఆస్ట్రేలియాకు చెందిన తొండ జాతి, ఇవి వాటి వేగం, దేనినైనా సులువుగా ఎక్కగల సామర్థ్యంతో కింగ్ లిజర్డ్ గా పేరు పొందాయి. వేరే జంతువులతో తగాదాకు దిగవలసి వచ్చినా, బెదిరినా ఇవి రెండు కాళ్లపైనా లేస్తాయి. ప్రమాదం నుండి దూరంగా పరుగుతీస్తాయి.

1. ఈ ఫ్రిల్డ్ డ్రాగన్ దాదాపు 3 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. సాధారణంగా గోధుమ, బూడిద రంగుల మిశ్రమంగా కనిపిస్తాయి. అయినప్పటికీ, ఇవి వాతావరణాన్ని బట్టి, వాటి రంగును నారింజ, ఆకుపచ్చగా మారుస్తూ ఉంటుంది.

frilled-dragon-1.jpg

2. ఫ్రిల్డ్ డ్రాగన్‌ల తల చుట్టూ ఉండే ప్రత్యేకమైన మెడకు ఫ్రిల్ గా పేరు పెట్టారు. భయపడినప్పుడు లేదా ఉద్రేకానికి గురైనప్పుడు, మాంసాహారులను తరిమికొట్టడానికి మిగతా ఫ్రిల్డ్ డ్రాగన్‌లపై ఆధిపత్యాన్ని చూపించడానికి ఇది ఒక అడుగు వెడల్పు వరకు పెరుగుతుంది.

3. హైయోయిడ్స్ అని పిలువబడే రెండు పొడవైన రాడ్ లాంటి ఎముకలను కలిగి ఉండటం వలన మెడ భాగాన్ని పెద్దగా విస్తరించుకోగలుగుతాయి.

Frilled-Dragons23.jpg

4. ఫ్రిల్డ్ డ్రాగన్‌లు దక్షిణ న్యూ గినియా, ఉత్తర ఆస్ట్రేలియా రెండింటిలోనూ నివసిస్తాయి. ఇవి నివాసాలను ఉన్నా కూడా ఉష్ణమండల అడవుల చెట్లలో ఎక్కువ సమయం గడుపుతాయి. అరుదుగా ఆహారం కోసం నేలపైకి వెళతాయి.

5. ఫ్రిల్డ్ డ్రాగన్‌లు ప్రధానంగా కీటకాలు, సకశేరుకాలు, చిన్న బల్లులను సైతం తింటాయి. వర్షాకాలంలో చాలా పెద్ద మొత్తంలో ఆహారాన్ని తింటాయి.

6. ఫ్రిల్స్ రంగు సాధారణంగా ఎరుపు, నారింజ, పసుపు, తెలుపు నుండి మారుతుంది. ఈ రంగు అప్పుడప్పుడు తీసుకునే ఆహారం ఆధారంగా కూడా మారుతుంది. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ ప్రచురించిన పరిశోధన ప్రకారం, కొన్ని కీటకాలను రోజూ తీసుకుంటే, ఫ్రిల్డ్ డ్రాగన్ ఫ్రిల్స్ రంగును ముదురు రంగులోకి మార్చగల వర్ణద్రవ్యాలను కలిగి ఉంటాయట.

frilled-dragon-3.jpg

7. ఈ జాతులలోని మగవి తమ ఆకట్టుకునే మెడను ప్రదర్శించడంతో పాటు వాటిలో అవి పోరాడుతాయి. ఆడ బల్లులు సాధారణంగా నవంబర్ నుండి ఫిబ్రవరి నెలల మధ్య గుడ్లు పెడతాయి. వాటిని భూమి క్రింద 1-8 అంగుళాలు పాతిపెడతాయి. 2 నుండి 3 నెలల తరువాత, సంతానం తయారవుతాయి.

8. ఫ్రిల్డ్ డ్రాగన్ గూడు ఉష్ణోగ్రత పిల్లలు మగవా లేదా ఆడవా అని నిర్ణయించడంలో సహాయపడుతుంది. 79°F వద్ద ఉంచిన గుడ్లు ఎక్కువగా ఆడపిల్లలను ఉత్పత్తి చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

Updated Date - 2022-11-12T13:45:43+05:30 IST