The Happy Alien plant : చార్లెస్ డార్విన్ కనుగొన్న హ్యేపీ ఏలియన్ ఫ్లవర్...!

ABN , First Publish Date - 2022-11-08T07:46:15+05:30 IST

చూడగానే గ్రహాంతర జీవులకు సంబంధించిన రూపంతో నవ్వుతూ కనిపిస్తుంది ఈ పువ్వు.

The Happy Alien plant : చార్లెస్ డార్విన్ కనుగొన్న హ్యేపీ ఏలియన్ ఫ్లవర్...!
Happy Alien plant

హ్యాపీ ఏలియన్ ప్లాంట్ - కాల్సియోలారియా యూనిఫ్లోరా అనేది దక్షిణ అమెరికా దక్షిణ భాగంలోని టియెర్రా డెల్ ఫ్యూగో మొక్క ఆకారంలో వింతగా కనిపించే జాతి. హ్యాపీ ఏలియన్ ఫ్లవర్ దీనికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి పెద్దగా శ్రమ అవసరం లేదు. ఆకారం చూడగానే గ్రహాంతర జీవులకు సంబంధించిన రూపంతో నవ్వుతూ కనిపిస్తుంది ఈ పువ్వు. అయితే ఈ మొక్క ప్రపంచంలోనే ఒకే ఒక చోట మాత్రమే పెరుగుతుందట. కాకపోతే ఈ మధ్యకాలంలో దీనిని దక్షిణ అమెరికా నుంచి చిలీ, అర్జెంటీనాలలో కూడా పెరుగుతుంది.

Happy-Alien-plant-2.jpg

ఈ మొక్క గురించి మరో విశేషం ఏంటంటే దీనిని చార్లెస్ డార్విన్ స్వయంగా కనుగొన్నాడు. అతని 1831-1836 యాత్రలో భాగంగా ఈ మొక్కను ఆవిష్కరించాడు. దీనిని డార్విన్స్ స్లిప్పర్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారు. వాస్తవానికి ఈ జాతికి మొదట కాల్సియోలారియా డార్విని అని పేరు పెట్టారు. ఈ మనోహరమైన విలక్షణమైన మొక్క పువ్వులు రెండు నుంచి ఐదు సెంటిమీటర్లు పొడవు పెరుగుతాయి. ఈ లక్షణం కారణంగానే కాకుండా రంగులోనూ ఇవి ప్రత్యేకంగా కనిపిస్తాయి. నారింజ, పసుపు రంగులలో ఇవి పెరుగుతాయి. పొట్టిగా, సన్నని కాండం మీద పెరుగుతాయి. నోటి మీద తెల్లటి పట్టీ కూడా ఉంటుంది.

Happy-Alien-1.jpg

ఈ చిన్న మొక్క మొదట దక్షిణ అమెరికాలోని టియెర్రా డెల్ ఫ్యూగో ద్వీపసమూహంలో మాత్రమే పెరిగింది. హ్యాపీ ఏలియన్ చల్లని వాతావరణ పర్వత జాతిగా పరిణామం చెందింది. వీటిలో చాలా వరకు తీరప్రాంత రాతి, ఇసుక ప్రాంతాలు, స్క్రబ్‌ల్యాండ్, మూర్స్, కొండ ప్రాంతాలలో పెరుగుతాయి. వీటి పువ్వులు వేసవి అంతా కనిపిస్తాయి. ఈ మొక్క పండ్లలో చిన్న విత్తనాలు ఉంటాయి. అయినప్పటికీ, చాలా వరకూ పుష్పించే మొక్కలలా కాకుండా ఈ జాతి మొక్కలు కీటకాల ద్వారా, పక్షుల ద్వారా పరాగసంపర్కాన్ని పొందుతుంది.

Updated Date - 2022-11-08T09:03:25+05:30 IST