మీకు SBI‌లో అకౌంట్ ఉందా? అయితే ఈ తాజా హెచ్చరిక మీ కోసమే!

ABN , First Publish Date - 2022-11-03T20:06:21+05:30 IST

SBI.. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. ఈ క్రమంలోనే ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరికైనా ఎస్బీఐ‌ బ్యాంకులో అకౌంట్ ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. కాగా.. తాజాగా తన ఖాతాదారులను ఉద్దేశించి.. సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన..

మీకు SBI‌లో అకౌంట్ ఉందా? అయితే ఈ తాజా హెచ్చరిక మీ కోసమే!
sbi

ఇంటర్నెట్ డెస్క్: SBI.. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. ఈ క్రమంలోనే ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరికైనా ఎస్బీఐ‌ బ్యాంకులో అకౌంట్ ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. కాగా.. తాజాగా తన ఖాతాదారులను ఉద్దేశించి.. సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేసింది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. భారీ మొత్తంలో నష్టపోవాల్సి ఉంటుందని హెచ్చరింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

సాంకేతిక అందుబాటులోకి వచ్చిన తర్వాత కేటుగాళ్లు ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. కొద్ది రోజుల వరకూ ఏదో ఒక సాకుతో ఫోన్ చేసి.. వ్యక్తిగత, బ్యాంకు వివరాలను తెలుకోవడం ద్వారా డబ్బులు కాజేసేవారు. కానీ ఇప్పుడు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. కరెంట్ బిల్లు పేరుతో దోచుకోవడం ప్రారంభించారు. ‘కరెంటు బిల్లు డ్యూ ఉంది. బిల్లు వెంటనే చెల్లించకపోతే మీ ఇంటికి పవర్ కట్ చేస్తాం’ అంటూ వాట్సప్, మెయిల్స్ తదితర మార్గాల ద్వారా మెసేజ్‌లు పంపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, మెసేజ్‌లో పేర్కొన్న నెంబర్‌కు ఫోన్ చేసేలా చేస్తున్నారు. తర్వాత అలా ఫోన్‌లో సంప్రదించిన వారి అకౌంట్ల నుంచి రకరకాల పద్ధతుల్లో డబ్బులు కాజేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే SBI తన ఖాతాదారులను అప్రమత్తం చేస్తూ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. కరెంటు బిల్లుల పేరిట వచ్చే మెసేజ్‌లపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఫోన్‌లకు వచ్చే మెసేజ్‌లు విద్యుత్తు సంస్థల నుంచి వచ్చాయా లేక పర్సనల్ నెంబర్ నుంచి వచ్చాయా అని గుర్తించాలని తెలిపింది. భయభ్రాంతులకు గురి కాకుండా వచ్చిన మెసేజ్‌ను క్షణ్ణంగా పరిశీలించాని తన ఖాతాదారులకు చెప్పింది. ఇలా పరిశీలించడం ద్వారా మేసేజ్‌లో వ్యాకరణ దోషాలను గుర్తించొచ్చని.. ఫలితంగా కేటుగాళ్ల వల నుంచి తప్పించుకోవచ్చని తెలిపింది. పొరపాటున భయాందోళనలకు గురై.. మెసేజ్‌లో పేర్కొన్న ఫోన్ నెంబర్‌కు కాల్ చేస్తే.. తర్వాత భారీ మొత్తంలో నష్టపోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Updated Date - 2022-11-03T20:58:45+05:30 IST