అర్ధరాత్రి నడిరోడ్డుపై భార్యను మరచిపోయి వెళ్లిపోయిన భర్త.. 150 కి.మి. తర్వాత చూసుకుంటే.. చివరకు..

ABN , First Publish Date - 2022-12-30T20:38:36+05:30 IST

మతిమరుపు అనేది చాలా సహజమైన విషయం. చాలా మంది ఎక్కడికైనా వెళ్లినపుడు తమ వస్తువులను మర్చిపోతుంటారు. థాయ్‌లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా తన భార్యనే మర్చిపోయాడు. అర్ధరాత్రి నడిరోడ్డుపై ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. 150 కి.మీ. తర్వాత చూస్తే కారులో భార్య కనిపించలేదు.

అర్ధరాత్రి నడిరోడ్డుపై భార్యను మరచిపోయి వెళ్లిపోయిన భర్త.. 150 కి.మి. తర్వాత చూసుకుంటే.. చివరకు..

మతిమరుపు అనేది చాలా సహజమైన విషయం. చాలా మంది ఎక్కడికైనా వెళ్లినపుడు తమ వస్తువులను మర్చిపోతుంటారు. థాయ్‌లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా తన భార్యనే మర్చిపోయాడు. అర్ధరాత్రి నడిరోడ్డుపై ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. 150 కి.మీ. తర్వాత చూస్తే కారులో భార్య కనిపించలేదు (Husband forgets wife on road trip). అప్పుడు అతడికి అసలు విషయం తెలిసింది. థాయ్‌లాండ్‌లోని (Thailand) మహాసరఖం ప్రావిన్స్‌‌లో ఈ ఘటన జరిగింది.

బూన్‌తోమ్ చైమూన్ అనే వ్యక్తి క్రిస్మస్ రోజున తన భార్య ఎమునేతో కలిసి రోడ్ ట్రిప్‌నకు (Road Trip) బయల్దేరాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత మూత్ర విసర్జన కోసం ఓ చోట కారు ఆపి ఇద్దరూ దిగారు. ఆ తర్వాత బూన్‌తోమ్ కారు వద్దకు వెళ్లి స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు. భార్య ఉందో, లేదో చూసుకోలేదు. అలా ఏకంగా 150 కి.మీ. ముందుకు వెళ్ళాడు. నడిరోడ్డుపై అర్ధరాత్రి ఒంటరిగా మిగిలి పోయిన ఆ మహిళ భయపడుతూ 20 కి.మీ. నడిచింది. అలా తెల్లవారుజామున 5 గంటల వరకు నడిచి ఓ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.

విషయం తెలుసుకున్న పోలీసులు బూన్‌తోమ్‌కు చాలాసార్లు ఫోన్‌ చేసినప్పటికీ అతను ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. చివరకు ఫోన్ లిఫ్ట్ చేసి అసలు విషయం తెలుసుకుని ఖంగుతిన్నాడు. అప్పటికి బూన్‌తోమ్ 150 కి.మీ. దూరం వెళ్లిపోయాడు. భార్య కోసం తిరిగి వెనక్కి వెళ్లాడు. పోలీసులు అడిగితే.. భార్య వెనుక సీట్లో కూర్చుని నిద్రపోతుందని అనుకున్నానని చెప్పాడు. పోలీసుల ఎదుట బూన్‌తోమ్ తన భార్యకు క్షమాపణలు చెప్పాడు. ఆ మహిళ తన భర్తను క్షమించేయడంతో కథ సుఖాంతమైంది.

Updated Date - 2022-12-30T20:38:38+05:30 IST