Swapping: హై క్లాస్ కుటుంబాల్లో ఇదంతా సాధారణం.. నువ్వే అలవాటు పడాలంటూ ఓ భర్త నీచం.. ఆ భార్య చెబుతున్న నిజాలివి..
ABN , First Publish Date - 2022-07-05T21:47:54+05:30 IST
‘‘ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచః నాతి చరామి’’ అంటూ అగ్నిచుట్టూ ఏడడుగులు వేసి దాంపత్య జీవితానికి నాంది పలుకుతాడు భర్త. మన దేశంలోని వివాహ వ్యవస్థ.. ఇతర దేశాలకు...
‘‘ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచః, నాతి చరామి’’ అంటూ అగ్నిచుట్టూ ఏడడుగులు వేసి దాంపత్య జీవితానికి నాంది పలుకుతాడు భర్త. మన దేశంలోని వివాహ వ్యవస్థ.. ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందనడంలో అతిశయోక్తి లేదు. అయితే రాను రాను కొందరు దంపతులు ప్రవర్తించే తీరు.. సభ్య సమాజం తల దించుకునేలా ఉంటోంది. కొన్నిచోట్ల భర్తను భార్యను మోసం చేస్తే.. మరికొన్ని ఘటనల్లో భార్యతో భర్త.. కలలో కూడా చేయని పనులన్నీ చేయిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. హై క్లాస్ కుటుంబాల్లో ఇదంతా సాధారణం.. అలువాటు చేసుకోవాలంటూ.. ఓ భర్త నీచానికి పాల్పడ్డాడు. ఆ భార్య చెప్పిన నిజాలు విని అంతా ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్‌నగర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన కవిత, కుమార్ (పేర్చు మార్చాం) దంపతులు. వీరికి 2021 జనవరిలో వివాహమైంది. అయితే కవిత మొదటి భర్త మూడేళ్ల క్రితం చనిపోవడంతో.. కుమార్‌ను రెండో వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమెకు 12ఏళ్ల కుమార్తె ఉంది. ఇదిలావుంగా, రెండో వివాహమైనా కుమార్.. తన భార్యను బాగా చూసుకునేవాడు. అయితే ఇటీవల ఓ రోజు కుమార్.. కవితను షాపింగ్ పేరుతో ఢిల్లీ తీసుకెళ్లాడు. తర్వాత అక్కడి ఓ పెద్ద భవనంలో జరుగుతున్న పార్టీకి తీసుకెళ్లి, స్నేహితుందరినీ భార్యకు పరిచయం చేశాడు. కొద్ది సేపటి తర్వాత కూల్ డ్రింగ్స్ తాగిన కవిత.. అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
భర్తే కదా అని.. అతడి ముందే దుస్తులు మార్చుకున్న భార్య.. అయితే ఆమెకు తెలీదు.. అవన్నీ వీడియోల రూపంలో ఉన్నాయని.. చివరకు..
తర్వాత ఆమెపై కుమార్ స్నేహితులు అత్యాచారం చేశారు. స్పృహ లోకి వచ్చాక జరిగిన విషయం తెలుసుకుని.. భర్తను ప్రశ్నించింది. హై క్లాస్ కుటుంబాల్లో భార్యల మార్పిడి కార్యక్రమం సర్వసాధారణమని చెప్పాడు. అయితే ఒకరి భార్యతో ఇంకొకరు శృంగారం చేయడం.. కవితకు నచ్చలేదు. కుమార్ మాత్రం మళ్లీ అలాంటి పార్టీలకు తీసుకెళ్లాలని ప్రయత్నించాడు. ఇలాంటివి నాకు నచ్చవు.. అని కవిత అనడంతో ఆగ్రహంతో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా శారీరకంగా చిత్రహింసలకు గురి చేశాడు. కొన్నిసార్లు భార్యను బలవంతంగా వివిధ పార్టీలకు తీసుకెళ్లేవాడు. అక్కడ కుమార్ స్నేహితులంతా ఆమెపై అత్యాచారం చేసేవారు. అయినా బయటికి ఎవరికీ చెప్పుకోలేక.. అలాగే భరించింది. అయితే ఇంట్లో ఉండగా, భర్త సోదరుడు కూడా మత్తు మందు ఇచ్చి కవితపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
పెళ్లి చేసుకోకపోగా.. అబార్షన్ చేయించాలని చూశాడు.. బిడ్డను చంపుకోవడం ఇష్టం లేదని ఆమె అనడంతో..
ఇలాంటివి చేయొద్దని ఎంత ప్రాథేయపడినా.. భర్త మాత్రం వినిపించుకోలేదు. పైగా అత్యాచారం చేసిన సమయంలో వీడియోలు తీసి, ఎవరికైనా చెబితే అన్నీ బయటపెడతామంటూ బెదిరించేవారు. ఇటు ఇంట్లో, అటు బయటా.. చిత్రహింసలు పెరిగిపోవడంతో చివరికి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అయినా పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో నేరుగా కోర్టును ఆశ్రయించి, జరిగిన అన్యాయంపై మొరపెట్టుకుంది. విచారించిన న్యాయస్థానం.. నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసును ఆదేశించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... భార్య మార్పిడి రాకెట్‌లో ఎంత మంది ఉన్నారు? ఇందులో పెద్దవారి ప్రమేయం ఏమైనా ఉందా? తదితర అంశాలపై విచారణ చేస్తున్నారు.