ఈ ఊరి పేరు పోస్ట్ చేస్తే ఫేస్ బుక్ అకౌంట్ బ్యాన్!!

ABN , First Publish Date - 2022-10-27T13:31:03+05:30 IST

టెస్టింగ్ కోసం ఆ గ్రామం పేరు ఫేస్‌బుక్‌లో రాసి మరీ కొందరు చేజేతులా తమ అకౌంటును కోల్పోయారు

ఈ ఊరి పేరు పోస్ట్ చేస్తే ఫేస్ బుక్ అకౌంట్ బ్యాన్!!

ఊరి పేరు రాస్తే అకౌంట్ బ్యాన్ అవుతుంది. ఈ మాట వినగానే అందరూ ఇదేం వింత అని ఆశ్చర్యపోతారు. కానీ.. ‘ఆ.. అంతా ఉత్తిదేలే అలాంటిది ఏమీ ఉండదు’ అని భావించి టెస్టింగ్ కోసం ఆ గ్రామం పేరు ఫేస్‌బుక్‌లో రాసి మరీ కొందరు చేజేతులా తమ అకౌంటును కోల్పోయారు. ‘అనుభవ పూర్వకంగా విషయం తెలుసుకున్న తరువాత ఇదేం వింతరా దేవుడా పేరుకే ఇలా జరుగుతోంది’ అని బాధపడుతున్నారు. అనంతరం ఆ గ్రామానికి ఉన్న హిస్టరి ఏంటో.. ఏమో అనే చెదపురుగులాంటి ఆలోచనకు బుర్రను అప్పగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు వివరాల్లోకి వెళితే....

స్వీడన్ లో ఓ గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు ఫుచే. ఈ గ్రామంలో ఎలాంటి నిషేధిత పనులు కానీ, ఏ విధమైన సమాజ వ్యతిరేక కార్యకలాపాలు కానీ జరగడం లేదు. ఇంకా చెప్పాలంటే ఆ గ్రామంలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటున్నారు. కానీ తమ గ్రామం పేరుతో అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకో ఏమో కానీ ఈ గ్రామం పేరును ఒక తిట్టుగా భావించి.. సోషల్ మీడియా వేదికలు దాన్ని బ్యాన్ చేశాయి. దీంతో నిబంధలన ప్రకారం ఆ పేరును సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దు. కాదని ఎవరైనా అలా చేస్తే సదరు వ్యక్తులు సోషల్ మీడియా అకౌంట్ బ్యాన్ అయిపోతుంది. దీంతో ఈ గ్రామస్తులు 'మేమెంతో సంతోషంగా ఉన్నా.. మా ఊరి పేరుతో చెప్పలేనంత ఇబ్బంది పడుతున్నాం, అందుకే మా ఊరి పేరును మార్చండి మహాప్రభో..!!' అంటూ కోర్టును ఆశ్రయించి పిటిషన్ వేశారు. కాగా.. తమ ఊరి పేరు తాము సోషల్ మీడియాలో రాసుకోలేని ఆ గ్రామ ప్రజల నిస్సహాయతకు కోర్టు వారి నుండి సుముఖమైన ఫలితం రావాలని కోరుకుందాం.

Updated Date - 2022-10-27T13:33:15+05:30 IST