Indonesia: పెళ్లికి ముందు శృంగారం నేరం.. చట్టం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఇండోనేసియా..
ABN , First Publish Date - 2022-12-03T17:39:54+05:30 IST
పెళ్లికి ముందు శృంగారంపై ఒక్కొక్కరిదీ ఒక్కో అభిప్రాయం. ఈ విషయంలో ఒక్కో దేశంలో చట్టాలు ఒక్కోలా ఉన్నాయి. కొన్ని దేశాల్లో పెళ్లికి ముందు శృంగారం నిషిద్ధం. కొన్ని దేశాల్లో మాత్రం అలాంటి ఆంక్షలు లేవు. పెళ్లికి ముందు శృంగారాన్ని నేరంగా పరిగణించే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి చట్టంగా మార్చాలని ఇండోనేసియా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
పెళ్లికి ముందు శృంగారంపై ఒక్కొక్కరిదీ ఒక్కో అభిప్రాయం. ఈ విషయంలో ఒక్కో దేశంలో చట్టాలు ఒక్కోలా ఉన్నాయి. కొన్ని దేశాల్లో పెళ్లికి ముందు శృంగారం నిషిద్ధం. కొన్ని దేశాల్లో మాత్రం అలాంటి ఆంక్షలు లేవు. ప్రపంచంలోనే ముస్లిం జనాభా అధికంగా గల దేశమైన ఇండోనేసియాలో (Indonesia set to ban premarital sex) ఇప్పటి వరకు ప్రీ మ్యారిటల్ సెక్స్‌పై ఎలాంటి ఆంక్షలూ లేవు. గతంలో ఒకసారి ప్రీ మ్యారిటల్ సెక్స్‌ను నిషేధించడానికి అక్కడి ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే అప్పట్లో ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గింది.
పెళ్లికి ముందు శృంగారాన్ని నేరంగా పరిగణించే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి చట్టంగా మార్చాలని ఇండోనేసియా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ చట్టాన్ని అతిక్రమిస్తే ఏడాదిపాటు జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధిస్తారు. దీనికి సంబంధించిన క్రిమినల్ కోడ్ ముసాయిదాను ఈ నెలలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ బిల్లు చట్టంగా మారితే.. పెళ్లికి ముందు శృంగారం, సహజీవనం చేయడం నిషేధం. భార్య లేదా భర్త కాని వారితో శృంగారంలో పాల్గొంటే వారిని వ్యభిచార నేరం కింద శిక్షిస్తారు. గరిష్ఠంగా ఏడాది పాటు జైలు శిక్ష లేదా భారీ జరిమానా ఉంటుంది. ఇండోనేసియా పౌరులకే కాకుండా ఆ దేశంలో నివసించే విదేశీయులకూ ఈ నిబంధనలు వర్తిస్తాయి.