Prabhas: మెహబూబా ఆమేనా?

ABN , First Publish Date - 2022-11-28T19:55:14+05:30 IST

‘1 నేనొక్కడినే’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు కృతిసనన్‌. ప్రస్తుతం ఆమె ప్రభాస్‌తో కలిసి ‘ఆదిపురుష్‌’ చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ ఆమెపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ స్టార్‌ హీరో ఆమెను ప్రేమిస్తున్నారని ‘భేడియా’ ప్రమోషన్‌లో పాల్గొన్న ఆయన చెప్పారు.

Prabhas: మెహబూబా ఆమేనా?

‘1 నేనొక్కడినే’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు కృతిసనన్‌. ప్రస్తుతం ఆమె ప్రభాస్‌తో కలిసి ‘ఆదిపురుష్‌’ (Adipurush)చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ (Varun Dhavan comments on Krithisanon) ఆమెపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ స్టార్‌ హీరో ఆమెను ప్రేమిస్తున్నారని ‘భేడియా’ ప్రమోషన్‌లో పాల్గొన్న ఆయన చెప్పారు. ‘‘కృతిసనన్‌ పేరు నా లిస్ట్‌లో లేదు. ఆమె పేరు మరొకరి హృదయంలో ఉంది. ఆ వ్యక్తి ప్రస్తుతం ముంబయిలో లేరు. దీపికా పడుకోన్‌తో వేరే ప్రాంతంలో షూటింగ్‌లో ఉన్నారు’’ అని చెప్పారు. ప్రస్తుతం వరుణ్‌ వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ఆ వ్యాఖ్యలు చూసిన నెటిజన్లు వరుణ్‌ మాట్లాడుతున్నది ప్రభాస్‌ (Prabhas) గురించే అని అభిప్రాయానికి వచ్చారు. 

Prabhas-Krithi-sanon.jpg

ఇదిలా ఉండగా ఓవర్సీస్‌ ఫిల్మ్‌ క్రిటిక్‌గా చెప్పుకొనే ఉమైర్‌ సందు... కృతీసనన్‌ ప్రభాస్‌ గురించి ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ‘ఆదపురుష్‌’ సెట్‌లో ప్రభాస్‌ హీరోయిన్‌ కృతీసనన్‌కి ప్రపోజ్‌ చేశాడనీ(Krithi sanon proposed to Prabhas), ప్రస్తుతం ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారనీ, త్వరలోనే ఎంగేజ్‌మెంట్‌ కూడా ఉంటుందని జోస్యం చెప్పేశాడు. ఇది అఫీషియల్‌ అని ట్వీట్‌ చేశాడు. అంతే కాదు ‘ప్రభాస్‌ మెహబూబా’ కృతీసనన్‌ అని రెండు నెలల క్రితమే చెప్పానని.. అదే నిజం కాబోతుందని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఉమైర్‌ ట్వీట్‌జి’, వ్యాఖ్యలను నెటిజన్లు అంతగా పట్టించుకోవడం మానేశారు. అయితే వరుణ్‌ ధావన్‌ వ్యాఖ్యలు ఈ వార్తలకు కాస్త బలాన్నిస్తున్నట్లు బాలీవుడ్‌ భావిస్తోంది. ఉమైర్‌ ట్వీట్‌లో నిజం ఉందా లేదా అన్నది తెలియాలంటే ప్రభాస్‌, కృతీ సనన్‌ పెదవి విప్పాల్సిందే! ఈ మధ్యకాలంలో చాలా వేదికలపై కృతీ.. ప్రభాస్‌ గురించి తెగ పొగిడేసింది. ఆయన అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పింది. అంతే కాదు.. ఎలాంటి క్వాలిటీస్‌ ఉన్న వరుడు కావాలని ఓ వేదికపై అడిగిన ప్రశ్నకు డార్లింగ్‌ ప్రభాస్‌ అని ఆమె సమాధానం ఇవ్వడం కూడా ఈ వార్త నిజమే అన్నట్లుగా బీటౌన్‌లో టాక్‌ వినిపిస్తోంది. 

Updated Date - 2022-11-28T20:11:37+05:30 IST