రూ.1,2కోట్ల వార్షిక వేతనంతో అమెజాన్ ఆఫర్.. రికార్డు సృష్టించిన లక్నో విద్యార్థి...
ABN , First Publish Date - 2022-04-07T20:00:42+05:30 IST
టాలెంట్ ఉండాలే గానీ.. ఉద్యోగాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. నైపుణ్యాలు ఉన్న విద్యార్థులకు ఉద్యోగాలు కొదవ ఉండదని గతంలో ఎన్నో సార్లు నిరూపణ అయ్యింది. తాజాగా ...
టాలెంట్ ఉండాలే గానీ.. ఉద్యోగాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. నైపుణ్యాలు ఉన్న విద్యార్థులకు ఉద్యోగాలు కొదవ ఉండదని గతంలో ఎన్నో సార్లు నిరూపణ అయ్యింది. తాజాగా లక్నోకు చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థి నిరూపించాడు. ఏకంగా రూ.1.2కోట్ల వార్షిక వేతనంతో ఆమెజాన్ ఆఫర్ కొట్టేసి.. రికార్డు సృష్టించాడు. కళాశాల చరిత్రలోనే అత్యధిక వేతనం అందుకున్న వ్యక్తిగా నిలిచాడు. దీంతో కళాశాల యాజమాన్యం, బంధువులు, స్నేహితులు.. అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో పరిధిలోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అభిజిత్.. నగరంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (ఐఐఐటీ)లో చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల నిర్వహించిన ప్లేస్మెంట్ డ్రైవ్‌లో అభిజిత్.. రూ.1,2కోట్ల వార్షిక వేతనంతో ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ఉన్న అమెజాన్ సంస్థలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్‌గా నియమితులయ్యారు. లక్నో ట్రిపుల్ ఐటీ గత రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ అత్యధిక వేతనం అందుకున్నాడు. గత ఏడాది వరకు తమ కళాశాల విద్యార్థులు ఏటా అత్యధికంగా రూ.40 లక్షల జీతంతో ఉద్యోగాలు వచ్చేవని.. అయితే ఈ ఏడాది అది రూ.1.20 కోట్లకు చేరిందని ఐఐఐటీ-లక్నో డైరెక్టర్ అరుణ్ మోహన్ షెర్రీ తెలిపారు.
వీడు మామూలోడు కాదు.. పరీక్షల్లో ఇతడు కాపీ కొట్టిన విధానం చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..
దేశంలోని టాప్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లతో సమానంగా ఉన్నట్లు చెప్పారు. విద్యార్థి అభిజిత్ మాట్లాడుతూ ఈ ఉద్యోగం వచ్చేందుకు తాను చాలా కష్టపడ్డానని చెప్పారు. అలాగే తన సీనియర్లను సంప్రందించి సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తెలిపాడు. అలాగే ఇంటర్వ్యూలో విజయం సాధించేందుకు.. అందుకు సంబంధించిన ఎన్నో వీడియోలను చూసినట్లు చెప్పాడు. సాఫ్ట్ స్కిల్స్‌తో పాటూ కమ్యూనికేషన్ నైపుణ్యాలు , బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ముఖ్యమని అభిజిత్ పేర్కొన్నాడు.