Viral Video: భార్యను మోసం చేయడానికి ఇలా ఎవ్వరూ ట్రై చేసి ఉండరు!
ABN , First Publish Date - 2022-10-30T15:46:36+05:30 IST
పెళ్లైన తర్వాత కొందరు మగవాళ్లు.. ఫ్రీడంను కోల్పోతూ ఉంటారు. పెళ్లికి ముందులా స్నేహితులతో కలిసి కాలక్షేపం చేయలేరు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన వీడియోనే నెట్టింట వైరల్‌గా..
ఇంటర్నెట్ డెస్క్: పెళ్లైన తర్వాత కొందరు మగవాళ్లు.. ఫ్రీడంను కోల్పోతూ ఉంటారు. పెళ్లికి ముందులా స్నేహితులతో కలిసి కాలక్షేపం చేయలేరు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన వీడియోనే నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ‘ఏం ఐడియా గురూ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఫెండ్స్‌తో పార్టీకి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిందో ఏమో తెలియదు కానీ ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా మోసం చేశాడు. అప్పటి వరకు స్నేహితులతో సరదాగా ఎంజాయ్ చేసిన వ్యక్తి.. భార్య నుంచి వీడియో కాల్ రాగానే.. రోడ్డుపైనే ఉండి ఇంట్లో పడుకున్నట్టు బిల్డప్ ఇచ్చాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న స్నేహితులు కూడా అతడికి సహకరించారు. ఒకరు దిండు పట్టుకోగా.. మరొకరు దుస్తులను కర్టెన్‌గా మార్చేసి ఇంట్లోనే ఉన్నాడనే భావన ఆమెకు కలిగేలా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారగా.. అదిచూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.