Insurance money: ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఓ వ్యక్తి ఊహించని పని.. తల్లిదండ్రుల సహకారంతో..

ABN , First Publish Date - 2022-12-07T21:05:00+05:30 IST

ఇన్సూరెన్స్ డబ్బు (Insurance money) కోసం బీమా కంపెనీలను అడ్డదారుల్లో మోసగించిన ఉద్దాంతాలు ఎన్నో ఉన్నాయి.

Insurance money: ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఓ వ్యక్తి ఊహించని పని.. తల్లిదండ్రుల సహకారంతో..

శ్రీనగర్: ఇన్సూరెన్స్ డబ్బు (Insurance money) కోసం బీమా కంపెనీలను అడ్డదారుల్లో మోసగించిన ఉద్దాంతాలు ఎన్నో ఉన్నాయి. ఈ కోవకే చెందిన మరో మోసం తాజాగా వెలుగుచూసింది. ఇన్సూరెన్స్ మనీ కోసం ఓ పాలసీదారుడు ఏకంగా తాను చనిపోయినట్టు నాటకమాడాడు. ఒకసారి విజయవంతంగా డబ్బు తీసుకున్నాడు. అంతటి సరిపెట్టుకోకుండా రెండవసారి ఏకంగా రూ.52 లక్షల కోసం పక్కా ప్లాన్ వేశాడు. చనిపోయినట్టు మరో ఫేక్ సర్టిఫికెట్ సృష్టించాడు. కానీ అడ్డంగా దొరికిపోయాడు. ఎలా పట్టుబడ్డాడు, ఏం జరిగిందో తెలియాలంటే పూర్తివివరాల్లోకి వెళ్లాల్సిందే.

కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాకు చెందిన తవీన్ హుస్సేన్ షా అనే వ్యక్తి తన తల్లిదండ్రుల సహకారంతో తాను చనిపోయినట్టు సృష్టించుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు ప్రచారం చేయించుకున్నాడు. ఈ మేరకు ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద తల్లిదండ్రుల ద్వారా క్లెయిమ్ చేయించాడు. ‘రోడ్డు ప్రమాద మరణం’ ఫేక్ సర్టిఫికెట్ సమర్పించి తొలుత ఒక పాలసీపై రూ.4.27 లక్షల మొత్తాన్ని తీసుకున్నాడు. ఎవరికీ అనుమానం కలగకపోవడంతో మరో రూ.52 లక్షలు విలువ చేసే మరో రెండు పాలసీలు తీసుకున్నాడు. వాటిని క్లెయిమ్ చేసుకునేందుకు కాశ్మీర్‌లోని బనిహల్‌లో ఆర్‌టీఏ నుంచి మరో డెత్ సర్టిఫికెట్ చేయించాడు. క్లెయిమ్ కూడా చేయిండాడు. కానీ ఇన్సూరెన్స్ కంపెనీ దర్యాప్తులో అసలు విషయం వెలుగుచూసింది. హుస్సేన్ షా (పాలసీ హోల్డర్) చనిపోలేదని తేలింది. ఇన్సూరెన్స్ డబ్బు కోసం డెత్ సర్టిఫికెట్స్ ఫోర్జరీ చేశాడని వెల్లడైంది.

ఈ విషయాన్ని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ అండ్ ఇన్సూరెన్స్ ఏరియా మేనేజర్ జితేందర్ పాల్ సింగ్, జమ్మూ ఐఆర్‌డీఏఐ ఫిర్యాదు మేరకు నిందితుడు హుస్సేన్ షాపై కేసు నమోదయ్యింది. ‘ఫారెస్ట్ మేజిస్ట్రేట్’లో కాశ్మీర్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఆఫ్ క్రైమ్ బ్రాంచ్ ఛార్జిషీటు నమోదు చేసింది. ప్రధాన నిందితుడు హుస్సేన్ షాతోపాటు అతడి అమ్మానాన్నలపైనా ఛార్జిషీటు వేశారు.

నిందితుడు హుస్సేన్ షా.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వద్ద రెండుసార్లు జీవితబీమా పాలసీలు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. చనిపోయినట్టు నాటకమాడి పెద్ద మొత్తంలో నగదు తీసుకున్నాడని ప్రస్తావించారు. అమ్మానాన్నలతో హుస్సేన్ షా నేరపూరిత కుట్రకు పాల్పడ్డాడని తేలింది.

Updated Date - 2022-12-07T21:16:32+05:30 IST