Credit Cards: అస్సలు ఊహించలేరు.. భారతీయులు క్రెడిట్ కార్డులతో వేటిని కొంటున్నారో తెలిస్తే షాకవుతారు!

ABN , First Publish Date - 2022-11-06T13:22:03+05:30 IST

క్రెడిట్ కార్డులను కలిగిన వాళ్లు.. వాటితో ఎలక్ట్రానిక్ వస్తులు, ఖరీదైన ఫోన్లు కొనుగోలు చేస్తుంటారని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ అది తప్పని తాజాగా వెల్లడైంది. ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు..

Credit Cards: అస్సలు ఊహించలేరు.. భారతీయులు క్రెడిట్ కార్డులతో వేటిని కొంటున్నారో తెలిస్తే షాకవుతారు!

ఇంటర్నెట్ డెస్క్: క్రెడిట్ కార్డులు(Credit Cards) వినియోగం ఈ మధ్యకాలంలో చాలా పెరిగిపోయింది. బ్యాంకుల మధ్య పోటీ పెరిగిపోవడంతో.. వెంటపడి మరీ ప్రజలకు రకరకాల క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. క్రెడిట్ కార్డుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. ప్రజలు కూడా వాటిని తీసుకుంటున్నారు. అత్యవసర సమయంలో డబ్బులు లేకున్నా.. అవసరాలు తీర్చుకొని.. ఆ మొత్తాన్ని తర్వాత చెల్లించే సౌకర్యం Credit Cards‌తో ఉన్న ముఖ్య ప్రయోజనం ఇది అందరికీ తెలిసిందే. క్రెడిట్ కార్డులను కలిగిన వాళ్లు.. వాటితో ఎలక్ట్రానిక్ వస్తులు, ఖరీదైన ఫోన్లు కొనుగోలు చేస్తుంటారని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ అది తప్పని తాజాగా వెల్లడైంది. ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి.

క్రెడిట్ కార్డులు వాడే వాళ్లలో దాదాపు సగం మంది వాటిని కిరాణా సరుకులు కొనుగోలు చేయడానికి(buying with credit cards) ఉపయోగిస్తున్నారట. ఆ తర్వాత ఇంధనం, దుస్తులు, ఫీజులు, బిల్లులు, రెస్టారెంట్‌ బిల్లులు, ఫ్లైట్/రైలు టికెట్లు కొనుగోలు చేయడానికి వాడుతున్నారట. రీపేమెంట్స్ చేయడానికి వీటిని ఉపయోగించే వాళ్లూ ఉన్నారట. కేవలం 10శాతం మంది మాత్రమే ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేస్తున్నారట. ఇక 2% మంది ప్రజలు మాత్రం.. ఇతర వస్తువులు కొనడానికి క్రెడిట్ కార్డులను వాడుతున్నారట. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా సుమారు 6కోట్ల మందికిపైగా ప్రజలు క్రెడిట్ కార్డులను వాడుతున్నారని Money 9 అనే సర్వే రిపోర్టులో వెల్లడైంది.

Updated Date - 2022-11-06T13:26:09+05:30 IST