Home » Indians
విషవాయువు పీల్చి 12 మంది భారతీయులు మృతిచెందిన విషయన్ని టిబ్లిసిలోని భారత రాయబార కార్యాలయం అధికారులు ధ్రువీకరించారు. అయితే, మృతుల్లో 11 మంది విదేశీయులని, ఒకరు తమ పౌరుడని జార్జియా అధికారులు ప్రకటించారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతుంది. మంగళవారం ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీగా క్షిపణి దాడులకు దిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం అక్కడి భారతీయులకు బుధవారం కీలక సూచన చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది.
ఇజ్రాయెల్‌లో ఉంటున్న భారత సంతతి పౌరులు అప్రమత్తంగా ఉండాలని, సేఫ్టీ ప్రోటాకాల్స్‌ను పాటించాలని ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ఒక అడ్వయిజరీ జారీ చేసింది. మధ్యప్రాశ్చంలోని ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య ఉద్రిక్తలు పెరుగుతుండటంతో ఇండియన్ ఎంబసీ ఈ అడ్వయిజరీ జారీ చేసింది.
ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు విదేశాలకు పయనమవుతున్న వారి సంఖ్య రోజురోజుకు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. అయితే అలా ఉన్నత విద్య కోసం వివిధ విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థుల్లో పలువురు వివిధ కారణాల వల్ల మృత్యువాత పడుతున్నారు.
గడిచిన 5 ఏళ్లలో విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించడానికి వెళ్లిన 633 మంది విద్యార్థులు మృతి చెందారని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.
కశ్మీరీ, ఖలిస్థానీ, పాకిస్థాన్ వ్యాప్తంగా దేశ వ్యతిరేక నాయకులను చంపేందుకు అఫ్ఘానిస్థాన్ తాలిబాన్లకు భారత్ 10 మిలియన్ డాలర్ల (రూ.83.36 కోట్లు) నిధులు..
హజ్ తీర్థ యాత్ర(Hajj Pilgrims) కోసం ఈ ఏడాది వెళ్లిన వారిలో ఇప్పటివరకు 90 మంది భారతీయులు(Indians) మరణించారని అధికారులు తెలిపారు. వివిధ దేశాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 645 మంది మృతి చెందారు.
కెనడా ఫుడ్ బ్యాంక్స్ నుంచి ఆహార పదార్థాలు అందిస్తుంటారు. వాస్తవానికి అవసరం ఉన్న వారు, పేదల కోసం ఫుడ్ అందజేస్తుంటారు. కెనడా టీడీ బ్యాంక్‌లో డాటా సైంటిస్ట్‌గా మెహుల్ ప్రజాపతి జాబ్ చేస్తున్నాడు. అతను కెనడా ఫుడ్ బ్యాంక్స్‌లో లైన్లో నిల్చొని ఉచితంగా ఆహార పదార్థాలు తీసుకున్నాడు. ఆ ఫుడ్ చూపిస్తూ వీడియో తీశాడు. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది.
ఇజ్రాయెల్‌పై సోమవారం క్షిపణి దాడి జరిగింది. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో గల మార్గలియట్ వ్యవసాయ క్షేత్రంపై క్షిపణి దాడి జరిగిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. క్షిపణి దాడిలో ఓ భారతీయ పౌరుడు మృతిచెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ముగ్గురు కేరళకు చెందిన వారని అధికారులు ప్రకటించారు.
భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ మంగళవారం చరిత్ర సృష్టించాడు. 1989 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సీడెడ్ ఆటగాడిని ఓడించిన భారత్ నుంచి అతను మొదటి ఆటగాడిగా నిలిచాడు. అయితే నాగల్ ఆర్థిక సంక్షోభ సమయంలో కోహ్లీ సపోర్ట్ చేశారనే చెప్పిన అంశం ప్రస్తుతం వైరల్ అవుతోంది.