పిల్లలు పుట్టడం లేదని రెండో పెళ్లి చేసుకున్న భర్త.. మొదటి భార్య కోపానికి నలుగురి ప్రాణాలు బలి..!
ABN , First Publish Date - 2022-05-17T00:22:00+05:30 IST
ఆమెకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఎంత కాలం గడుస్తున్నా ఆమెకు పిల్లలు పుట్టలేదు..
ఆమెకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఎంత కాలం గడుస్తున్నా ఆమెకు పిల్లలు పుట్టలేదు.. దీంతో ఆమెను భర్త వదిలించుకునేందుకు ప్రయత్నించాడు.. పిల్లల కోసం అని చెప్పి మరో పెళ్లి చేసుకున్నాడు.. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ మహిళ భర్తపై, అతని రెండో భార్యపై, అతని తల్లిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది.. అనంతరం తనపై కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.. బీహార్‌లోని దర్బంగాలో ఈ ఘటన జరిగింది.
దర్బంగాకు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన మహ్మద్ ఖుర్షీద్, బీబీ పర్వీన్ దంపతులకు పిల్లలు లేరు. బీబీకి పిల్లలు పుట్టరు అనే కారణంతో మహ్మద్ మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. తన పక్క గ్రామానికి చెందిన రోష్ని అనే మహిళను వివాహం చేసుకున్నాడు. దీంతో బీబీ తీవ్ర ఆగ్రహానికి గురైంది. తను ఉండగానే మరో వివాహం చేసుకున్న భర్తకు బుద్ధి చెప్పాలనుకుంది.
భర్త, అతని తల్లి, రెండో భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. అనంతరం తనపై కూడా కిరోసిన్ పోసి నిప్పంటించుకుంది. మంటలు తీవ్రంగా చెలరేగడంతో నలుగురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. స్థానికుల సమాచారం ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.