INDIAN RAILWAY: 10 నెలల చిన్నారికి రైల్వే ఉద్యోగం..!

ABN , First Publish Date - 2022-07-09T23:18:42+05:30 IST

భారతీయ రైల్వే దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థను కలిగి ఉంది. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు.. తాజాగా రైల్వేశాఖ చరిత్రలోనే మునుపెన్నడూ చూడని..

INDIAN RAILWAY: 10 నెలల చిన్నారికి రైల్వే ఉద్యోగం..!

భారతీయ రైల్వే దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థను కలిగి ఉంది. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు.. తాజాగా రైల్వేశాఖ చరిత్రలోనే మునుపెన్నడూ చూడని నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన 10 నెలల చిన్నారికి రైల్వేశాఖలో ఉద్యోగం కల్పించింది. అత్యంత అరుదైన ఈ కారుణ్య నియామకం.. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లోని ఆగ్నేయ మధ్య రైల్వేలో జరిగింది. చిన్నారి రాధికకు ఉద్యోగానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఇందులో భాగంగా రాధిక వేలి ముద్రలు సేకరించారు. చిన్నారికి 18 ఏళ్లు నిండాక ఉద్యోగంలో చేరేందుకు అర్హురాలు అవుతుందని అధికారులు వెల్లడించారు.


ఆగ్నేయ మధ్య రైల్వే చరిత్రలోనే ఈ నియామకం ప్రత్యేకమైనదని, ఇంత చిన్న వయసులో కారుణ్య నియామకం అరుదైన రికార్డుగా అధికారులు తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. రైల్వేశాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్న రాజేంద్రకుమార్‌.. ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.. ఈ ప్రమాదంలో అతని భార్య కూడా మృతిచెందింది. చిన్నారి రాధిక మాత్రం ప్రాణాలతో బయటపడింది. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన చిన్నారికి ఆపన్నహస్తం అందించేందుకు రైల్వేశాఖ ముందుకు వచ్చింది. చిన్నారి రాధికకు రైల్వేలో కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చింది.

చేపలు తినేందుకు నిరాకరిస్తున్న Penguins.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!



Updated Date - 2022-07-09T23:18:42+05:30 IST