Patodia Contract: ప్రపంచంలో అతిపెద్ద హ్యాండ్‌మేడ్‌ కార్పెట్‌.. రికార్డులకెక్కిన పటోడియా కాంట్రాక్ట్‌!

ABN , First Publish Date - 2022-11-24T18:00:07+05:30 IST

కరోనా భయంతో ప్రపంచం మొత్తం వణుకుతున్న వేళ భారత్‌లోని కార్పెట్ నగరంగా ఖ్యాతికెక్కిన భదోహిలో గతేడాది ఓ భారీ ప్రాజెక్టుకు

Patodia Contract: ప్రపంచంలో అతిపెద్ద హ్యాండ్‌మేడ్‌ కార్పెట్‌.. రికార్డులకెక్కిన పటోడియా కాంట్రాక్ట్‌!
Handmade Carpet

న్యూఢిల్లీ: కరోనా భయంతో ప్రపంచం మొత్తం వణుకుతున్న వేళ భారత్‌లోని కార్పెట్ నగరంగా ఖ్యాతికెక్కిన భదోహిలో గతేడాది ఓ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం పడింది. మధ్య ఆసియాలో అతి పెద్ద మసీదుగా ఖ్యాతి గడించిన కజక్‌స్థాన్‌లోని నూర్‌-సుల్తాన్‌ మసీదు (Nur-Astana Mosque) కోసం పటోడియా కాంట్రాక్ట్‌ (Patodia Contract) ఈ ప్రాజెక్ట్‌ చేపట్టింది. ప్రపంచంలో అతి పెద్ద హ్యాండ్‌మేడ్‌ కార్పెట్‌గా 12వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ కార్పెట్‌ను తీర్చిదిద్దారు. ఈ కార్పెట్‌లో మెడాలియన్‌ 70 మీటర్ల వ్యాసార్థం కాగా, 80 టన్నుల న్యూజిలాండ్‌ ఊల్‌ స్పన్‌ వినియోగించారు. వెయ్యి మంది కార్మికులు ఆరు నెలలు శ్రమించి దీనిని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. రెండు డిజైన్‌లు ఉన్న ఈ కార్పెట్‌లో మసీదులో కోర్ట్‌యార్డ్ కేంద్రంగా వృత్తం, జన్నత్‌ ఉల్‌ ఫిరదౌస్‌ స్ఫూర్తితో ఇంకో డిజైన్‌ ఉంది.

ప్రపంచంలో ఇంత భారీ స్థాయిలో చేతితో తయారుచేసిన కార్పెట్ ఇదే. దీనికి సంబంధించి యార్న్‌ స్పిన్నింగ్‌ మొదలు, సైట్‌లో దాని ఇన్‌స్టాలేషన్‌ వరకూ మొత్తం కార్యక్రమాన్ని పటోడియా కాంట్రాక్ట్‌ నిర్వహించింది. నెలకు 25వేల చదరపు మీటర్ల కార్పెట్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన పటోడియా ప్రతి దశలోనూ నాణ్యత నియంత్రణకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. మధ్య ఆసియాలో అతి పెద్ద మసీదు కోసం కార్పెట్‌ రూపకల్పనలో పటోడియా అనేక జాగ్రత్తలు తీసుకుంది. మసీదులోని షాండ్లియర్, కార్నర్స్‌, ఫ్లోరింగ్‌, కన్వర్జింగ్‌ వాల్స్‌, పిల్లర్లు వంటివి పరిగణలోకి తీసుకుని కార్పెట్‌ తీర్చిదిద్దారు.

carpet1.jpg

హ్యాండ్‌ నాటెడ్‌, హ్యాండ్‌ ఓవెన్‌, హ్యాండ్‌ టఫ్టెడ్‌ కార్పెట్ల తయారీలో పటోడియా కాంట్రాక్ట్‌‌కు మంచి పేరుంది. ఈ కంపెనీ 1881 నుంచి కార్పెట్‌ తయారీ రంగంలో ఉంది. ప్రపంచంలో అగ్రగామి కార్పెట్‌ డిజైనర్లతో భాగస్వామ్యం చేసుకుని కస్టమైజ్డ్‌ కార్పెట్లను సైతం తయారుచేస్తోంది.

Updated Date - 2022-11-24T18:00:09+05:30 IST