జైలు నుంచి రిలీజ్ అవుతున్న స్నేహితుడికి స్వాగతం.. పబ్లిక్ న్యూసెన్స్ అంటూ 83 మంది అరెస్ట్.. వారిలో 33 మంది ఎవరో తెలిసి..
ABN , First Publish Date - 2022-06-17T22:33:54+05:30 IST
వారంతా స్నేహితులు. అయితే వారిలో ఓ వ్యక్తి జైలు నుంచి బెయిల్‌పై విడుదల అవుతున్నాడని తెలిసింది. ఇంకేముందీ అంతా సంబరాలు చేసుకున్నారు. స్నేహితుడికి ఘన స్వాగతం పలకాలని..
వారంతా స్నేహితులు. అయితే వారిలో ఓ వ్యక్తి జైలు నుంచి బెయిల్‌పై విడుదల అవుతున్నాడని తెలిసింది. ఇంకేముందీ అంతా సంబరాలు చేసుకున్నారు. స్నేహితుడికి ఘన స్వాగతం పలకాలని నిర్ణయించుకున్నారు. మొత్తం 83 మంది వాహనాలు వేసుకుని రోడ్డుపై న్యూసెన్స్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని అందరినీ అరెస్ట్ చేశారు. అయితే వారిలో 33మంది గురించి తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
సౌత్ వెస్ట్ ఢిల్లీలోని ఢిల్లీ కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తుగ్లకాబాద్ ఎక్స్‌టెన్షన్‌లోని వీధి నంబర్ 6లో నివసిస్తున్న అబిద్ అహ్మద్.. ఓ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడికి అధికారులు బెయిలు మంజూరు చేశారు. గురువారం రాత్రి అహ్మద్ విడుదల అవుతున్నాడనే విషయం స్నేహితులకు తెలిసింది. దీంతో మొత్తం 83మంది కలిసి.. తమ స్నేహితుడికి ఘనంగా స్వాగతం పలకాలని నిర్ణయించుకున్నారు. గురువారం రాత్రి వాహనాలు వేసుకుని రోడ్డుపై హల్‌చల్ చేస్తూ బయలుదేరారు. స్నేహితుడిని రిలీవ్ చేసుకుని, తీహర్ జైలు నుంచి తుగ్లకాబాద్‌కు బయలుదేరారు.
Leave Letter లో ఓ ఉద్యోగి చెప్పిన కారణానికి అవాక్కవుతున్న నెటిజన్లు.. ఇంత నిజాయితీ ఏంట్రా బాబూ అంటూ..
ఈ క్రమంలో వాహనాల్లో లౌడ్ స్పీకర్లు పెట్టి, సంబరాలు చేసుకున్నారు. రోడ్డు పైనే న్యూసెన్స్ చేయడంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని అందరినీ అదుపులోకి తీసుకున్నారు. విచారించగా, వారిలో 33మందిపై అప్పటికే హత్య, హత్యాయత్నం, దోపిడీ తదిరాలకు సంబంధించిన కేసులు నమోదైనట్లు గుర్తించారు. 83మందిలో ఓ మైనర్ కూడా ఉండడంతో విచారించిన అనంతరం విడుదల చేశారు. మిగతా అందరినీ అరెస్ట్ చేసి, వారి నుంచి 19 కార్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.