తెల్లారేసరికి బెడ్రూంలో నిర్జీవంగా పడి ఉన్న భార్య.. ఆమె లేకుంటే నేనూ బతకను అంటున్న భర్త.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2022-04-11T17:26:47+05:30 IST
ఉత్తరప్రదేశ్లో దంపతుల మధ్య తలెత్తిన చిన్న సమస్య.. చివరకు చాలా దూరం వెళ్లింది. తెల్లాసరికి బెడ్రూంలో...
కుటుంబంలో కలహాలు ఎప్పుడు, ఎలా మొదలవుతాయో.. ఎవరూ చెప్పలేరు. దంపతుల మధ్య కలహాలు మామూలే అనుకుని చుట్టుపక్కల వారు కూడా పట్టించుకోరు. అయితే కొన్నిసార్లు మాత్రం ఈ కలహాలు చాలా దూరం వెళ్తుంటాయి. ఉత్తరప్రదేశ్లో దంపతుల మధ్య తలెత్తిన చిన్న సమస్య.. చివరకు చాలా దూరం వెళ్లింది. తెల్లాసరికి బెడ్రూంలో భార్య నిర్జీవంగా పడి ఉంది. ఆమె లేకుంటే నేనూ బతకను అని భర్త బోరుమన్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహోబా జిల్లా కుల్పహాడ్ కొత్వాలి పరిధిలోని జైత్పూర్ గ్రామంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బ్రిజేష్ కుష్వాహాకు.. అకౌనా గ్రామానికి చెందిన ఉమా(23)కు 2016లో వివాహమైంది. మొన్నటిదాకా వీరి కుటుంబంలో ఎలాంటి సమస్యలూ లేవు. అయితే ఇటీవల భార్యకు అనారోగ్యంగా ఉండడంతో ‘‘ రూ.5,000లు ఇస్తే.. ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటా’’.. అని భర్తను కోరింది. అయితే భర్త మాత్రం ‘‘ ఇప్పుడు నా వద్ద డబ్బులు లేవు.. తర్వాత వీలైతే ఇస్తా’’.. అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. శుక్రవారం రాత్రి ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. శనివారం ఉదయానికి బెడ్రూంలో ఉమ నిర్జీవంగా పడి ఉంది. బంధువులు, స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
నిన్ను తప్ప వేరే వారిని పెళ్లి చేసుకోను.. అని అనడంతో ప్రియుడు ఏం చేసినా కాదనలేదు.. ఓ రోజు అతడి గురించి విచారించగా..
అయితే ఆమె అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి గొంతుకు తాడు బిగుసుకుని ఉన్నట్లు గుర్తించారు. అయితే ఉమ కుటుంబ సభ్యులు మాత్రం.. తమ కూతురి మృతికి అల్లుడు, అతని కుటుంబ సభ్యులే కారణమని ఆరోపిస్తున్నారు. నిత్యం డబ్బులు తేవాలని ఒత్తిడి చేయడంతో వారం క్రితమే రూ.70వేలు ఇచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుండగా ఉమ మృతదేహాన్ని దహనం చేస్తున్న క్రమంలో.. తానూ చనిపోతానంటూ బ్రిజేష్, మంటల్లో దూకేందుకు ప్రయత్నించాడు. పక్కనున్న వారు గమనించి అతన్ని పక్కకు లాక్కెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఉమ మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.