Queen Elizabeth Letter: 2085 లోనే ఈ లేఖను ఓపెన్ చేయండన్న ఎలిజబెత్ రాణి.. 63 ఏళ్లపాటు ఖజానాలోనే ఉత్తరం..!

ABN , First Publish Date - 2022-09-12T23:04:23+05:30 IST

క్వీన్‌ ఎలిజబెత్‌-2.. 70ఏళ్లపాటు బ్రిటన్‌ రాణిగా కొనసాగారు. బ్రిటన్‌తోపాటు మరో 14దేశాలకూ ఆమే హెడ్ ఆఫ్ ది స్టేట్. 96ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూసిన క్వీన్ ఎలిజబెత్.. 1986లో ఓ ఉత్తరం రాశారు. అప్పట్లో ఆమె

Queen Elizabeth Letter: 2085 లోనే ఈ లేఖను ఓపెన్ చేయండన్న ఎలిజబెత్ రాణి.. 63 ఏళ్లపాటు ఖజానాలోనే ఉత్తరం..!

ఇంటర్నెట్ డెస్క్: క్వీన్‌ ఎలిజబెత్‌-2.. 70ఏళ్లపాటు బ్రిటన్‌ రాణిగా కొనసాగారు. బ్రిటన్‌తోపాటు మరో 14దేశాలకూ ఆమే హెడ్ ఆఫ్ ది స్టేట్. 96ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూసిన క్వీన్ ఎలిజబెత్.. 1986లో ఓ ఉత్తరం రాశారు. అప్పట్లో ఆమె రాసిన ఉత్తరం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆమె రాసిన ఆ ఉత్తరంలో ఏముందో ఆమెకు తప్ప ఎవ్వరికీ తెలియదు. అందులో ఏముందో తెలియాలంటే.. ఈ ప్రపంచం ఇంకా 63ఏళ్లు వెయిట్ చేయక తప్పదు. కాగా.. క్వీన్ ఆ ఉత్తరాన్ని ఎవరిని ఉద్దేశించి రాశారు? ప్రస్తుతం ఆ ఉత్తరం ఎక్కడ ఉంది? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఒకసారి పరిశీలిస్తే..



Queen Elizabeth II.. హెడ్ ఆఫ్ ది స్టేట్‌గా ఉన్న దేశాల జాబితాలో ఆస్ట్రేలియా(Australia) కూడా ఉంది. ఈ క్రమంలోనే ఆమె head of state హోదాలో ఆస్ట్రేలియాను దాదాపు 16సార్లు విజిట్ చేశారు. 1986 నవంబర్‌లో క్వీన్ ఆస్ట్రేలియాను విజిట్ చేసినప్పుడు ఆమె సిడ్నీ ప్రజలను ఉద్దేశించి సీక్రెట్ లెటర్(secret letter) రాశారు. ఆ లేఖను అక్కడి పాలకుల చేతికి అందించి.. దాన్ని 2085 వరకు తెరవ కూడదని ఆదేశించారు. అంతేకాకుండా 2085లో ఏదో ఒక రోజును సెలెక్ట్ చేసుకుని.. ఉత్తరంలోని తన సందేశాన్ని సిడ్నీ ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. క్వీన్ ఎలిజబెత్-2 రాసిన ఆ లేఖలో ఏముందనేది ఆమె పర్సనల్ స్టాఫ్‌కు కూడా తెలియదట. ప్రస్తుతం ఈ లేఖ ఆస్ట్రేలియాలోని క్వీన్ విక్టోరియా బిల్డింగ్‌లో.. అత్యంత భద్రమైన లాకర్‌లో ఉంది. క్వీన్ ఎలిజబెత్ మరణం తర్వాత అప్పట్లో ఆమె రాసిన ఉత్తరం గురించి చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే.. క్వీన్ ఎలిజబెత్-2 మరణానంతరం.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ మాట్లాడుతూ.. క్వీన్ హృదయంలో ఆస్ట్రేలియాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. క్వీన్ ఎలిజబెత్-2 ఆస్ట్రేలియా పర్యటనలను పరిశీలిస్తే అర్థమవుతుందన్నారు. 


Updated Date - 2022-09-12T23:04:23+05:30 IST