ఇదెక్కడి ఘోరం..? అపార్ట్మెంట్లలోకి రాత్రిళ్లు స్లిప్పులు విసిరేస్తున్న యువకుడు.. అందులో రాసింది చదివి అంతా షాక్..!
ABN , First Publish Date - 2022-12-31T15:52:03+05:30 IST
రాయ్‌పూర్‌కు చెందిన ఓ యువకుడు మగ వేశ్యగా మారాలనుకుంటున్నాడు. డబ్బు తీసుకుని మహిళలకు శృంగార సుఖం అందించాలనుకుంటున్నాడు. ఆ విషయం అందరికీ తెలియజేయడానికి వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడు.
రాయ్‌పూర్‌కు చెందిన ఓ యువకుడు మగ వేశ్యగా (Raipur's boy wants to become a Sex Worker) మారాలనుకుంటున్నాడు. డబ్బు తీసుకుని మహిళలకు శృంగార సుఖం అందించాలనుకుంటున్నాడు. ఆ విషయం అందరికీ తెలియజేయడానికి వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడు. ఆ యువకుడు చిన్న చిన్నీ చీటీలపై తన పేరు, మొబైల్ నెంబర్ రాసి వాటిని రాత్రి సమయాల్లో అపార్ట్మెంట్లలోకి, ఇళ్లలోకి విసురుతున్నాడు. వాటిని చదివి షాకైన ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు (Chhattisgarh Crime News).
నవ రాయ్‌పూర్ సెక్టార్ 30లో అవినాష్ న్యూ కంట్రీ అనే కాలనీ ఉంది. ఈ కాలనీలో గత కొన్ని రోజులుగా వింత స్లిప్పులు దర్శనమిస్తున్నాయి. ఈ స్లిప్పులపై ఓ యువకుడి పేరు, ఫోన్ నంబర్ రాసి ఉంది. తాను మగ సెక్స్ వర్కర్ అని, ఎవరికైనా అవసరమైతే ఫోన్ చేయాలని ఆ స్లిప్‌లపై ఉంది. ఈ స్లిప్పులతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఎలాంటి ఉపయోగమూ కనిపించలేదు. దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
నవ రాయ్‌పూర్‌లోని ఓ కళాశాలలో చదువుతున్న యువకుడు ఈ పని చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం ఆ యువకుడిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్లిప్పులపై రాసి ఉన్న ఫోన్ నంబర్ ఓ అమ్మాయిది అయి ఉండొచ్చని, ఆమెను వేధించేందుకే ఆ యువకుడు ఇలాంటి పనికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ పూర్తయ్యాక మొత్తం వివరాలను బయటపెడతామని పేర్కొన్నారు.