అత్యంత అరుదుగా దొరికే విస్కీ.. ఒక్క బాటిల్ ధర రూ.4 కోట్లు.. దాని ప్రత్యేకతలేంటో తెలుసా?

ABN , First Publish Date - 2022-01-20T06:17:46+05:30 IST

మద్యం ప్రియులలో విస్కీ ప్రియులు వేరయా.. అని నిరూపించాడు ఒక చైనీయుడు. విస్కీ అంటే సాధారణమైనది కాదు. చాలా అరుదుగా దొరికే యమజాకీ (Yamazaki) విస్కీ. ఇటీవలే ఒక ఎయిర్‌పోర్టు వేలంలో ఒక బాటిల్ యమజాకీ విస్కీ 4,88,000 పౌండ్లు...

అత్యంత అరుదుగా దొరికే విస్కీ.. ఒక్క బాటిల్ ధర రూ.4 కోట్లు.. దాని ప్రత్యేకతలేంటో తెలుసా?

మద్యం ప్రియులలో విస్కీ ప్రియులు వేరయా.. అని నిరూపించాడు ఒక చైనీయుడు. విస్కీ అంటే సాధారణమైనది కాదు. చాలా అరుదుగా దొరికే యమజాకీ (Yamazaki) విస్కీ. ఇటీవలే ఒక ఎయిర్‌పోర్టు వేలంలో ఒక బాటిల్ యమజాకీ విస్కీ 4,88,000 పౌండ్లు(దాదాపు రూ.4.14 కోట్ల)కు అమ్ముడుపోయిందంటే దానికున్న డిమాండ్ ఏంటో అర్ధమవుతోంది.


అసలు యమజాకీ విస్కీ అంత ధర పలకడానికి దాని ప్రత్యకత ఏమిటంటే..


యమజాకీ విస్కీ జపాన్‌లో మాత్రమే తయారు చేయబడుతుంది. ఈ విస్కీకి ఒక స్పెషల్ టేస్ట్ ఉంటుంది. 55 ఏళ్ల పాటు నిల్వ చేయబడిన తరువాత దానికి ఆ టేస్ట్ వస్తుంది. యమజాకీ విస్కీని మూడు రకాల ప్రత్యేకమైన మిజనారో మాల్ట్‌(కలప)లతో తయారుచేయబడింది. ఈ విస్కీకి జపాన్‌కు హౌస్ ఆఫ్ సన్టరీ సంస్థ వ్యవస్థాపకుడు షింజోరీ టోరీ తొలిసారిగా తయారుచేశాడు.


హౌస్ ఆఫ్ సన్టరీ సంస్థ దీనిని ఇప్పటివరకు రెండు సార్లు మాత్రమే తయారుచేసింది. 2020 సంవత్సరంలో 100 బాటిళ్లు తయారు చేసి లాటరీ పద్దతిలో వీటిని విక్రయించింది. 2021లో మరో 100 బాటిళ్లు విక్రయించింది. ఇటీవల ఇస్తాన్‌బుల్ ఎయిర్‌పోర్టులో యూనిఫ్రీ అనే సంస్థ డ్యూటిఫ్రీలో ఒక బాటిల్ యమజాకీ విస్కీ వేలానికి పెట్టింది. 


ఆ వేలంలో 8 మంది పాల్గొనగా.. ఒక చైనా వ్యక్తి దానిని  4,88,000 పౌండ్లకు దక్కించుకున్నాడు.

Updated Date - 2022-01-20T06:17:46+05:30 IST