Amazing News: కొడుకు కావాలన్న ఆశతో మరోసారి గర్భందాల్చగా ఏకంగా..
ABN , First Publish Date - 2022-12-20T18:39:42+05:30 IST
ఆ దంపతులకు ఎవరికీ రాని వింత సమస్య వచ్చి పడింది. అంతంతమాత్రమే ఆదాయమే ఉన్న వారికి అప్పటికే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వాళ్లను పోషించలేకే ఇబ్బంది పడుతున్నారు. అయితే..
ఆ దంపతులకు ఎవరికీ రాని వింత సమస్య వచ్చి పడింది. అంతంతమాత్రమే ఆదాయమే ఉన్న వారికి అప్పటికే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వాళ్లను పోషించలేకే ఇబ్బంది పడుతున్నారు. అయితే కొడుకు కావాలని వారికి ఎప్పటి నుంచో ఆశ. ఈ క్రమంలో మహిళ మరోసారి గర్భం దాల్చింది. అయితే ఈసారి ఏకంగా ముగ్గురు కొడుకులు పుట్టారు. ఒక్క అబ్బాయి అయినా కావాలనుకుని ప్రయత్నిస్తే ముగ్గురు కొడుకులను భగవంతుడు ఇచ్చాడని ఆనందపడాలో.. లేక ఏకంగా ఆరుగురు సంతానాన్ని ఎలా పెంచి పోషించాలా.? అని బాధపడాలో తెలియని పరిస్థితి ఆ తల్లిదండ్రులది. వివరాల్లోకి వెళితే..
కలెక్టరేట్‌కు చేరిన ఎలుకల పంచాయితీ.. ఇరువర్గాల ఆరోపణలు విని షాకైన పోలీసులు..
రాజస్థాన్ (Rajasthan) దుంగార్పూర్ జిల్లా సగ్వాడ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బడు, జయంతిలాల్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు (Three daughters) ఉన్నారు. వీరిది సాధారణ మధ్య తరగతి కుటుంబం కావడంతో పిల్లల పోషణ భారంగా మారింది. అయితే వీరికి కొడుకు కావాలని ఎప్పటి నుంచో కోరిక ఉండేది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. నవంబర్ 26న ఆమెకు పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె ఒకేసారి ముగ్గురు కొడుకులకు (Three sons) జన్మనిచ్చింది. అయితే పిల్లలు నెలలు నిండకుండా జన్మించడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
25 రోజుల అనంతరం ఇటీవల వారిని డిశ్చార్జ్ చేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఈ దంపతులకు ఇక్కడే సమస్య వచ్చిపడింది. ఇప్పటికే ముగ్గురు కూతుళ్లను పోషించలేక ఇబ్బంది పడుతున్న వారికి మళ్లీ ముగ్గురు కొడుకులు పుట్టడంతో ఆలోచనలో పడ్డారు. కొడుకులు పుట్టినందుకు సంతోషించాలో.. లేక మొత్తం ఆరుగురు పిల్లలను ఎలా పోషించాలో తెలీక సందిగ్ధంలో పడిపోయారు. మరోవైపు.. ఒకే కాన్పులో ముగ్గురు కొడుకులు జన్మించడంతో.. బడు, జయంతిలాల్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
భర్తను చంపి.. మృతదేహం పక్కనే రాత్రంతా నిద్రపోయిన భార్య.. నాన్నను లేపొద్దంటూ పిల్లలకు చెప్పి..