Shraddha Murder Case: అడవిలో దొరికిన శ్రద్ధ ఎముకలు.. తండ్రి డీఎన్‌ఏతో మ్యాచ్..!
ABN , First Publish Date - 2022-11-26T15:42:46+05:30 IST
ఢిల్లీలోని శ్రద్ధా వాకర్ హత్య కేసు (Shraddha Murder Case) కీలక దశకు చేరుకుంది. హత్య కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ వర్గాలు తమ కీలక నివేదికను సిద్ధం చేసినట్టు సమాచారం. మెహ్రౌలీ అడవిలో లభించిన ఎముకల డీఎన్‌ఏ, శ్రద్ధా తండ్రి డీఎన్‌ఏతో (Shraddha`s Father's DNA Matched With Bones) మ్యాచ్ అయినట్టు సమాచారం.
ఢిల్లీలోని శ్రద్ధా వాకర్ హత్య కేసు (Shraddha Murder Case) కీలక దశకు చేరుకుంది. హత్య కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ వర్గాలు తమ కీలక నివేదికను సిద్ధం చేసినట్టు సమాచారం. మెహ్రౌలీ అడవిలో లభించిన ఎముకల డీఎన్‌ఏ, శ్రద్ధా తండ్రి డీఎన్‌ఏతో (Shraddha`s Father's DNA Matched With Bones) మ్యాచ్ అయినట్టు సమాచారం. శ్రద్దా హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసులు (Delhi Police) మెహ్రౌలీ అడవిలో వెతకగా కొన్ని ఎముకలు లభ్యం అయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకుని డీఎన్‌ఏ టెస్ట్‌కు పంపించారు. వాటి డీఎన్ఏ శ్రద్ధా తండ్రి డీఎన్‌తో సరిపోలినట్టు తెలుస్తోంది. నిందితుడు అఫ్తాబ్ పూనావాలా.. శ్రద్ధను హత్య చేసినట్టు చాలా వరకు రుజువైనట్టేనని సమాచారం.
ప్రస్తుతానికి ఫోరెన్సిక్ బృందం నుంచి ఢిల్లీ పోలీసులకు మౌఖిక సమాచారమే వచ్చినట్టు సమాచారం. పూర్తి స్థాయిలో అధికారిక రిపోర్ట్ రావడానికి మూడు లేదా నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది. మృతదేహాన్ని రంపంతో కోసినట్లు కూడా ఫోరెన్సిక్ విచారణలో నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. కాగా, శ్రద్ధ ఎముకలను అడవిలో పారవేసేందుకు ఇంటి నుంచి బయలుదేరే సమయంలో అఫ్తాబ్ ప్రతిసారి తన మొబైల్ ఫోన్ GPSను ఆఫ్ చేసేవాడు. లేదా తన ఫోన్‌ను ఫ్లాట్‌లోనే వదిలి వెళ్లేవాడు. శ్రద్ధా మొబైల్ సిమ్ కార్డును ముంబైలోని సముద్రంలో పడేసినట్లు, ముంబై నుంచి తిరిగి వస్తూ ఓ నదిలో మొబైల్‌ను విసిరేసినట్టు పోలీసుల విచారణలో అఫ్తాబ్ చెప్పాడు.
కాగా, శ్రద్ధ తండ్రి వికాస్ వాకర్ సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. ఒక న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, వికాస్ మాట్లాడుతూ.. అఫ్తాబ్ ఇప్పటికీ పోలీసులను తప్పు దారి పట్టిస్తున్నాడు. ఈ కేసుపై సీబీఐ విచారణ జరగాలి. అతను నిరంతరం శ్రద్దాను బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నాడు. ఆమెను చంపేస్తానని బెదిరించేవాడు. ఈ హత్యలో అఫ్తాబ్ కుటుంబం పాత్ర కూడా ఉంది. అఫ్తాబ్ చేష్టల గురించి అతని తల్లిదండ్రులకు కూడా తెలుసు. శ్రద్ధను అఫ్తాబ్ హింసిస్తున్నాడని వారికి తెలుసు. అయినా వారేం చేయలేదు. కనీసం నాకు కూడా చెప్పలేదు. పోలీసులు అఫ్లాబ్ కుటుంబ సభ్యులను కూడా విచారించాల
ని వికాస్ వ్యాఖ్యానించారు.