Air India: వామ్మో.. ఎయిరిండియా విమానంలో పాము..

ABN , First Publish Date - 2022-12-10T22:00:30+05:30 IST

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) విమానం కార్గో హోల్డ్‌లో (cargo hold) సిబ్బంది పామును (Snake) గుర్తించారు.

Air India: వామ్మో..  ఎయిరిండియా విమానంలో పాము..

న్యూఢిల్లీ: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) విమానం కార్గో హోల్డ్‌లో (cargo hold) సిబ్బంది పామును (Snake) గుర్తించారు. ఈ విమానం కేరళలోని కాలికట్ నుంచి దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో శనివారం ల్యాండయ్యాక ఈ పామును గుర్తించినట్టు డీజీసీఏ అధికారులు వెల్లడించారు. విమానంలోకి పాము ఎలా ప్రవేశించిదనేదానిపై దర్యాప్తు జరుపుతున్నట్టు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. బీ737-800 విమానం కేరళలోని కాలికట్ నుంచి దుబాయ్ వెళ్లిందని, ప్రయాణికులు అందరూ సురక్షితంగా దిగారని చెప్పారు. దుబాయ్ ఎయిర్‌పోర్టులో పాముని గుర్తించాక ఎయిర్‌పోర్ట్ ఫైర్ సర్వీసెస్‌కు సమాచారం అందించారని తెలిపారు. ఇది గ్రౌండ్ నిర్వహణా లోపమని, ఈ ఘటనపై దర్యాప్తు జరపాల్సి ఉందని, తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని సదరు అధికారి పేర్కొంది. కాగా ఈ ఘటనపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి స్పందించలేదు.

Updated Date - 2022-12-10T22:01:07+05:30 IST