Krishna: సూపర్‌స్టార్‌ కృష్ణ‌కి తీవ్ర అనారోగ్యం

ABN , First Publish Date - 2022-11-14T10:55:32+05:30 IST

సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) తీవ్ర అనారోగ్యం పాలయ్యారు..

Krishna: సూపర్‌స్టార్‌ కృష్ణ‌కి తీవ్ర అనారోగ్యం

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. వయస్సు పైబడిన కారణాలే ఆయన అనారోగ్యానికి కారణమని తెలుస్తోంది. దీంతో ఆయన్ని వెంటనే కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ.. ఈ విషయం తెలిసిన ఘట్టమనేని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సూపర్‌స్టార్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

కాగా.. కొన్ని నెలల క్రితం ఆయన కుటుంబానికి సంబంధించిన ఓ వేడుకలో కృష్ణ పాల్గొన్నారు. దానికి సంబంధించిన పిక్ ఒకటి అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో ఆయన ముఖంపై మచ్చలు కనిపించడంతో అభిమానులు ఆందోళన చెందారు. ఆయనకి ఏదైనా అనారోగ్య సమస్య ఉందా అని ఆరా తీశారు. అనంతరం కృష్ణ ఆరోగ్యంపై ఆయన సన్నిహితులు స్పందించి హెల్త్‌పై అప్‌డేట్ ఇచ్చారు. ఆయన ట్రాన్ఫరెంట్ మాస్క్ ధరించడం వల్ల అలా కనిపించింది తప్ప ఆయన ముఖంపై ఎటువంటి మచ్చలు లేవని చెప్పుకొచ్చారు. దాంతో.. ఘట్టమనేని అభిమానులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2022-11-14T11:08:36+05:30 IST