భర్తతో విడిపోయి దూరంగా ఉంటోందని తెలుసుకుని పక్కా ప్లాన్.. ఇంటి వద్ద విడిచిపెడతామంటూ కారులో ఎక్కించుకుని..

ABN , First Publish Date - 2022-08-25T03:00:34+05:30 IST

ఆమె.. భర్తతో దూరంగా ఉంటూ కుమారుడితో కలిసి జీవిస్తోంది. భర్త లేడనే విషయం తెలుసుకున్న కొందరు ఆమెపై కన్నేశారు. ఎలాగైనా తమ దారికి తెచ్చుకోవాలని.. అవకాశం కోసం ఎదురు...

భర్తతో విడిపోయి దూరంగా ఉంటోందని తెలుసుకుని పక్కా ప్లాన్.. ఇంటి వద్ద విడిచిపెడతామంటూ కారులో ఎక్కించుకుని..
ప్రతీకాత్మక చిత్రం

ఆమె.. భర్తతో దూరంగా ఉంటూ కుమారుడితో కలిసి జీవిస్తోంది. భర్త లేడనే విషయం తెలుసుకున్న కొందరు ఆమెపై కన్నేశారు. ఎలాగైనా తమ దారికి తెచ్చుకోవాలని.. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఓ రోజు ఆటో కోసం ఎదురుచూస్తున్న ఆమె వద్దకు వెళ్లి.. ఇంటి వద్ద వదులుతామని కారులో ఎక్కించుకున్నారు. అయితే ఇంటికి కాకుండా నేరుగా లాడ్జ్‌కి తీసుకెళ్లారు. మొత్తం ఐదుగురు కలిసి ఆమెపై దారుణానికి పాల్పడ్డారు. సంచలనం కలిగించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 


గుజరాత్ (Gujarat) రాష్ట్రం అహ్మదాబాద్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజ్‌కోట్‌ సమీపానికి చెందిన మహిళకు 1993లో వివాహమైంది. అయితే భర్తకు అప్పటికే వివాహమైందని తెలియడంతో 1996నుంచి దూరంగా ఉంటోంది. ప్రస్తుతం కుమారుడితో కలిసి జీవనం సాగిస్తోంది. ఇదిలావుండగా, ఇటీవల అమ్రేలికి చెందిన మయూర్ కతిరియాతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆమెను ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుండేవాడు. ఇటీవల ఓ రోజు ఆటో కోసం ఎదురు చూస్తున్న ఆమె వద్దకు కారులో వెళ్లాడు.

7ఏళ్ల కూతురి ఎదుటే తండ్రి చేసిన నిర్వాకం.. ఘటన జరిగిన కాసేపటికే అతను తీసుకున్న అనూహ్య నిర్ణయంతో..


అప్పటికే అతడితో పాటూ అశోక్‌ పోపట్‌, ధంజీ, జగదీష్‌ అనే వ్యక్తులు లోపల ఉన్నారు. తర్వాత ఆమెను ఇంటికి తీసుకెళ్లకుండా నేరుగా లాడ్జికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న ఇద్దరితో కలిసి మొత్తం ఆరుగురు.. ఆమెపై ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఘటటను మొత్తం వీడియో కూడా తీశారు. బయట ఎవరికైనా చెబితే.. వీడియో అందరికీ చూపిస్తామంటూ బెదిరించారు. తర్వాత ఆమెను బస్టాండు వద్ద వదిలేసి పారిపోయారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

ప్లాట్‌ఫారమ్‌‌పై భార్యతో మాట్లాడుతున్న భర్త.. తీరా ట్రైన్ దగ్గరికి రాగానే అతడు చేసిన నిర్వాకం..

Updated Date - 2022-08-25T03:00:34+05:30 IST