Black Kite : ఆకాశంలో ఎగురుతూ చురుగ్గా దిశ మార్చుకుంటాయి.

ABN , First Publish Date - 2022-12-06T10:53:59+05:30 IST

ఆకాశంలో ఎగురుతూ విన్యాసాలు చేస్తాయి

Black Kite : ఆకాశంలో ఎగురుతూ చురుగ్గా దిశ మార్చుకుంటాయి.
Black Kite

బ్లాక్ కైట్స్ నాలుగు ఖండాలలో విస్తృతంగా కనిపించే పక్షులు. ఇవి ప్రపంచంలో అత్యంత సమృద్ధిగా ఉన్న రాప్టర్ జాతి. ఈ పక్షులు సాధారణంగా ముదురు రంగులో ఉంటాయి. కానీ తల, మెడ పాలిపోయినట్లు కనిపిస్తుంది. రెక్కల ఈకలు నల్లగా ఉంటాయి. ఈ డేగల్లో మగవాటి కంటే ఆడ పక్షులు పరిమాణంలో పెద్దగా ఉంటాయి. ఆకాశంలో ఎగురుతూ విన్యాసాలు చేస్తాయి. చూపు తీక్షణంగా ఉంటుంది. వేటను పసిగట్టే విధంగా కంటిచూపు మెరుగ్గా ఉంటుంది.

black-kite.jpg

ఈ డేగలు యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో కనిపిస్తాయి. యూరోపియన్, మధ్య ఆసియా పక్షులు చలికాలంలో ఉష్ణమండల ప్రాంతాలకు వలస వెళతాయి. ఇవి చిత్తడి నేలలు, నది అంచులు, తీరాలు, గడ్డి భూములు, పొదలు, అడవులలో నుండి పెద్ద నగరాల వరకు అనేక రకాల ఆవాసాలలో నివసిస్తాయి. బ్లాక్ కైట్స్ తుప్పలు, చెట్లు ఉన్న ప్రదేశాలలో చాటుమాటున ఉండి వేటను ఎగురుతూనే పసిగట్టి పట్టుకుంటుంది. దీని తోక పొడుగ్గా ఉండటం వల్ల ఆకాశంలో ఎగురుతున్నప్పుడు వెంటనే దిశ మార్చుకుంటుంది.

అలవాట్లు, జీవనశైలి

బ్లాక్ కైట్స్ శీతాకాలంలో పగటిపూట వేటాడతాయి. ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు చాలా తరచుగా భూమివైపుకు వస్తూ పైకి ఎగురుతూ వేటను పసిగడతాయి. బ్లాక్ కైట్స్ ప్రత్యేకమైన అరుపుతో ఇతర పక్షులను కమ్యునికేట్ చేస్తాయి. ఇవి మాంసాహారులు చేపలు, చిన్న క్షీరదాలు, పక్షులు, గబ్బిలాలు, ఎలుకలను వేటాడతాయి. బ్లాక్ కైట్స్ పొగ, మంటలకు ఆకర్షితులవుతాయి, గూడును కాపాడుకోవడంలో ఆడా పగ పక్షులు పోటీ పడతాయి.

Updated Date - 2022-12-06T11:01:20+05:30 IST